యూరప్ పార్లమెంట్‌లో డ్యాన్స్ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్‌లో ఇటీవల నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. యూరప్ భవిష్యత్‌పై సమాలోచన జరిగింది. సమావేశాల చివరి రోజైన సోమవారం పౌరుల సూచనల ఆధారంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న దానిపై చర్చించారు. అయితే సమావేశాల చివర్లో పది నిమిషాల పాటు కొందరు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement