Friday, November 22, 2024

International: విద్యుత్ విక్ర‌యంలోకి నేపాల్‌.. స్వాగ‌తించిన ఇండియా

భారత్, నేపాల్‌ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజల మధ్య ఏర్పడిన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, వ్యాపార బంధాలు పరిస్థితులకు అనుగుణంగా మార‌తున్నాయి. త‌మ మిగులు విద్యుత్ అమ్మ‌కానికి నేపాల్ ముందుకు రావ‌డంతో ఇండియా స్వాగ‌తించింది. ఇరు దేశాలమధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సరిహద్దు సమస్య పాత సంబంధాలను మరింత ఆధునికరూపంలోకి మల్చుకోవడానికి ఇదొక అవ‌కాశంగా మార‌నుంది.

నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తన మిగులు విద్యుత్‌ని విక్రయించేందుకు రెడీగా ఉంది. ఖాట్మండు నుండి నిరంతర లాబీయింగ్ ద్వారా భారతదేశం యొక్క పవర్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో విద్యుత్‌ను విక్ర‌యించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. అయితే దీనికి భార‌త్‌ కూడా ఫ‌స్ట్ టైమ్ డోర్స్ ఓపెన్ చేసి నేపాల్ ఆలోచ‌న‌ల‌ను స్వాగ‌తించింది.

నేపాల్‌లోని 24 మెగావాట్ల త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ తో పాటు.. మ‌రో 15 మెగావాట్ల దేవిఘాట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 39 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి అవుతోంది. దీన్ని విక్రయించడానికి నేపాల్‌ను అనుమతించాలని సంబంధిత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్ణయించినట్లు ఆ దేశ ఇంధన, జలవనరులు, నీటిపారుదల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (IEX), భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందిన తర్వాత రెండు ప్రాజెక్టులు కూడా మ‌రిత అభివృద్ధి జ‌రిగాయి. కాగా, “నేపాల్ తన విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి భారతదేశం ఆమోదించిన త‌ర్వాత‌, రెండు దేశాల మధ్య విద్యుత్ వాణిజ్యం కొత్త దశలోకి ప్రవేశించింది.. అని ఆ దేశ‌ ఇంధన, జలవనరులు, నీటిపారుదల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రతినిధి గోకర్ణ రాజ్ పంథా మాట్లాడుతూ.. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇప్పుడు ప్రతిరోజూ IEXలో విద్యుత్ విక్రయించడానికి వేలంలో పాల్గొంటుంద‌న్నారు. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నేపాల్ బిడ్‌లో పాల్గొనడానికి భార‌త్‌కు చెందిన NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్‌ని తన ప్రతినిధిగా నియమించింది. ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధి మధు భేతువాల్ తెలిపిన ప్రకారం.. 456 మెగావాట్ల ఎగువ తమకోషి జలవిద్యుత్ ప్రాజెక్ట్‌తో సహా మరో రెండు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేస్తున్న ప‌వ‌ర్‌ని విక్రయించాలనే నేపాల్ ప్రతిపాదనను కూడా భారత అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement