Wednesday, November 20, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-స్థిరంగా వెండి

నేటి బంగారం ధ‌ర‌లు స్థిరంగానే కొన‌సాగుతుండ‌గా వెండి కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 51,870 వద్ద కొనసాగుతోంది. నిన్న కూడా పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు కూడా స్థిరంగానే ఉంది. 10 గ్రాములకు రూ. 47,550 వద్ద కొనసాగుతోంది. ఈ బంగారం రేటు కూడా నిన్న నిలకడగానే కొనసాగింది. వెండి ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. సిల్వర్ రేటు కేజీకి రూ. 63 వేల వద్ద కొనసాగుతోంది.

నిన్న కూడా వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం. అందువల్ల రేట్లలో కొంత మార్పు ఉండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి రేటు 0.02 శాతం పైకి చేరింది. ఔన్స్‌కు 1805 డాలర్ల పైన కదలాడుతోంది. అలాగే సిల్వర్ రేటు కూడా దూసుకుపోయింది. 0.26 శాతం పెరుగుదలతో ఔన్స్‌కు 20.66 డాలర్లకు చేరింది. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగుతు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. అందువల్ల మన దేశంలో కూడా పసిడి రేట్లు పైపైకి కదిలే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement