Saturday, November 23, 2024

King of Fruits : ఇంటర్నేషనల్​ మ్యాంగో ఫెస్టివల్​.. ఢిల్లీలో ఘనంగా ఉత్సవాలు!

అన్ని పండ్లలో కెల్లా మామిడి పండ్లనే రాజుగా పోలుస్తారు. ఢిల్లీలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మామిడి పండ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు (international mango festival). ‘కింగ్ ఆఫ్ మామిడి’ పేరుతో ఈ ఉత్సవాలు జరుగుతాయి. కోలాహలంగా, సంతోషంగా జరిగే ఈ పండుగలో దాదాపు 1100కు పైగా మామాడి జాతి రకాలను ప్రదర్శనకు ఉంచుతారు. మార్కెట్‌లో లభించే వివిధ రకాల మామిడిపండ్లను సహజసిద్ధంగా పండించిన వాటిని ఇక్కడ ప్రదర్శనలో చూడొచ్చు.

ఢిల్లీ ఇంటర్నేషనల్ మామిడి ఫెస్టివల్ (IMF) ఈ సంవత్సరం మరోసారి దేశంతోపాటు, విదేశాల నుండి కూడా మామిడి పెంపకందారులను ఆహ్వానిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి.. వారి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది ఎంతో ఉపయోగంగా ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ వంటి ఉత్తర భారతదేశంలోని మామిడి తోటల నుంచి వచ్చిన పండ్లతో పాటు.. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , కేరళలోని పండ్లను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచనున్నారు.

IMF ప్రతి సంవత్సరం జూన్ నుండి ఆగస్టు మధ్యకాలంలో ఈ పండుగ నిర్వహిస్తుంటుంది. ఈ ప్రదర్శనలో కల్మి, అల్ఫోన్సో, బాదామి, హిమ్సాగర్, రత్నగిరి వంటి జాతుల పండ్లు ఉంటాయి. ఏటా మామిడి పండ్లను తినేందుకు పోటీలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు. విజేతలకు బహుమతి కూడా అందిస్తుంటారు. తాజా, ప్రకృతి సేద్యమైన మామిడి ఉత్పత్తులను అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ పండుగ జరగుతుంది.

అంతేకాకుండా ఈ సారి బహ్రేయిన్​లోనూ ఎనిమిది రోజుల పాటు మామిడి పండ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఫుడ్​ ప్రొడక్ట్స్ ఎక్స్​పోర్ట్​ అథారిటీ తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం, వాటికి మరింత ప్రాచుర్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు దీనికి సంబంధించి ట్వీట్​ కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement