Saturday, November 23, 2024

Spl Story | యువ జంటలకు ముద్దుల పండుగ.. జులై 6న ఇంటర్నేషనల్​ కిస్సింగ్​ డే!

ముక్కుపై ముద్దుపెట్టు, ముక్కెరై పోయేట్టు.. చెంపపై ముద్దుపెట్టు, చెక్కెరై పోయేట్టు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఎంతో హిట్టయ్యింది. చాలామంది యువతీ యువకులు తమ అన్యోన్యాన్ని తెలిపుకుంటూ సరదాగా హమ్​ చేస్తుంటారు కూడా.. అదే విధంగా ముద్దుపై తెలుగు చిత్రాల్లో అనేక పాటలున్నాయి. కానీ, ముద్దులకు సంబంధించి ఓ స్పెషల్​ డే ఉందన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. ఇంటర్నేషనల్​ కిస్సింగ్​ డేని ప్రతి సంవత్సరం జులై 6వ తేదీన జరుపుకుంటారు. ఈ కిస్సింగ్​డే ఏంటి? దీని సంగతేంటో చదివి తెలుసుకుందాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ముద్దు అనేది ప్రేమను, సంతోషాన్ని వ్యక్త పరిచే ఓ అలౌకిక వ్యక్తీకరణ. ముద్దు అనేది ఎదుటి వ్యక్తి మనపై ఎంత ఎమోషన్​​ని కలిగి ఉన్నాడో తెలియజేయడంలో సహాయపడుతుంది. కొన్ని సార్లు ఏమీ మాట్లాడకుండానే చాలా చెప్పాలనుకునే వారు కూడా కిస్​ రూపంలో వారిలోని ఆప్యాయతను తెలియజేస్తుంటారు. ఇది ఒక్క యువతీ, యువకుల విషయంలో కాదండోయ్​.. అన్నా, చెల్లి.. తల్లీ, కొడుకు, తండ్రి, కూతరు.. ఇలా రకరకాల రిలేషన్స్​లోని ఘాడతను తెలియజేస్తుంది. నుదిటిపై ముద్దు గౌరవాన్ని సూచిస్తే.. బుగ్గలపై ముద్దు ప్రేమను సూచిస్తుంది. ఇక.. కిస్​ చేయడం వల్ల కూడా హెల్త్​ పరంగా ఎంతో మేలు జరుగుతుంది.

అంతర్జాతీయ ముద్దుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జులై 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు యువ జంటలకు పండగే పండుగ అని చెప్పవచ్చు.. ఈ ‘కిస్ డే’ అనేది ప్రేమికుల రోజు ‘కిస్ డే’ కంటే భిన్నమైంది. పాశ్చాత్య దేశాల్లో (Western Countries) బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం సర్వసాధారణం.  ప్రజలు కూడా కృతజ్ఞతలు చెప్పడానికి కానీ, స్వాగతం చెప్పినప్పుడు కానీ వారి సంతోషాన్ని తెలియజేయడానికి ముద్దులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే.. నేటికీ భారతదేశాన్ని ఈ తరహా విధానం లేదు. కిస్సింగ్ డే ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్యత, ప్రయోజనం, చరిత్ర ఏమిటి? విషయాలు చాలా ఇంట్రెస్టింగ్​గా ఉన్నాయి.

అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం మొదట యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ముద్దుల దినోత్సవం విశేష ప్రజాదరణ పొందింది. ఏటా జులై 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ముద్దుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం అంటే శారీరక ఆకర్షణకు దూరం కాదు. సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకునే రోజు. ఈ కిస్​ డే అనేది యువ జంటల ప్రేమ చిహ్నానికి మాత్రమే పరిమితం కాకుండా.. తల్లిదండ్రులు, సోదరుడు–-సోదరి, తండ్రి–-కుమార్తె, తల్లి–-కొడుకుల సంబంధాలను కూడా తెలియజేస్తుంది. 

- Advertisement -

ముద్దు పెట్టుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముద్దుల ప్రక్రియ మెదడులోని ఆక్సిటోసిన్, డోపమైన్ , సెరోటోనిన్ అనే కొన్ని రసాయనాలను విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది. ఇది మెదడులోని ఆనంద కేంద్రాలను ప్రేరేపించడం ద్వారా హ్యాపీ మూడ్​లోకి తీసుకెళ్లి మంచి అనుభూతిని కలిగిస్తుంది.   నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక నిమిషం పాటు ముద్దు పెట్టుకోవడం వల్ల దాదాపు 6 కేలరీలు తగ్గుతాయి. జంటలు ముద్దు పెట్టుకున్నప్పుడు, లవ్ హార్మోన్ అనే ఆక్సిటోసిన్ హార్మోన్ మెదడులో ఉత్పత్తి అవుతుంది, ఇది వారి పరస్పర సంబంధంలో ఆప్యాయత, అనుబంధాన్ని కలిగిస్తుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల కార్టిసాల్ స్థాయి, ఒత్తిడి తగ్గుతాయి. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లేదా ఐ లవ్ యు చెప్పడం వంటి ఇతర ఆప్యాయతతో కూడిన మార్గాలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని పలు పరిశోధనల్లో రువువయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement