Thursday, November 21, 2024

Telangana: అంతర్జాతీయ కళోత్సవ వైభవం… క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా మూడురోజుల‌పాటు సాంస్కృతికోత్స‌వాలు

కరీంనగర్ అంటేనే కళాకారులు… సాహితీ వేత్తలకు పుట్టినిల్లు. అందుకే కరీంనగర్ జిల్లాను కళలకణాచి అని పిలుస్తారు. అలాంటి కరీంనగర్ ఇప్పుడు మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళోత్సవాలకు ముస్తాబవుతోంది. నేషనల్, ఇంటర్నేషనల్ కళాసంస్కృతులను పరిచయం చేసేందుకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాల నుండి కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొనున్నారు. అయితే ఈ ఉత్సవాలను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టిని సారించారు. దీనికి పకడ్బందీ ఏర్పాట్లను చేపడుతున్నారు.

బతుకమ్మ పండగల వేళ కరీంనగర్ వాసులను మురిపించేందుకు అంత‌ర్జాతీయ క‌ళోత్స‌వ వైభ‌వం సిద్ధ‌మవుతోంది. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 3రోజుల పాటు నిర్వహించనున్న ఈ కళోత్సవాలను నభూతో… నభవిష్యత్ అన్నట్టుగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. కళోత్సవాల్లో కేవలం తెలంగాణ నుండే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా 150 బృందాల కళాకారులు తరలిరానున్నారు. ఒక్కో బృందంలో 15నుంచి 18 మంది కళాకారులు… కళాప్రదర్శనలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement