Friday, November 22, 2024

ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ స‌ర్వీసెస్.. డిసెంబర్ 15 నుంచి అందుబాటులోకి..

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు పౌర విమానయనాన శాఖ ప్రకటించింది. అయితే ప్రయాణ ఆంక్షలను విధించిన 14 దేశాలకు తప్పా మిగతా కంట్రీస్‌కి ఎయిర్‌లైన్స్ రాకపోకలు సాగుతాయని తెలిపింది. ప్రయాణ ఆంక్షలున్న దేశాల జాబితాలో.. చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్​, బంగ్లాదేశ్​, బ్రిటన్​, సింగపూర్​, న్యూజిలాండ్, హాంకాంగ్, జింబాబ్వే, మారిషస్​, బోట్స్​వానా, ఇజ్రాయెల్​ వంటి దేశాలున్నాయి.

అయితే.. ఆయా దేశాల్లో ప్రపంచానికి మ‌ళ్లీ కొత్త సమస్యను తెచ్చిపెట్టిన‌ కరోనా B.1.1.529 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలకు విమాన సేవలపై ఆంక్షలు కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆయా దేశాలకు ఎయిర్​ బబుల్ ఒప్పందంతో పరిమిత సంఖ్యలో విమాన సేవలు కొనసాగొచ్చని సమాచారం. కొత్త వేరియంట్​కు ప్రధాన కేంద్రమైన దక్షిణాఫ్రికాకు మాత్రం విమాన సేవలు పూర్తిగా నిలిచిపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాలు దక్షిణాఫ్రికాపై ప్రయాణ ఆంక్షలు విధించడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement