Friday, November 22, 2024

Spl Story: అప్పుడప్పుడు ఉపవాసం మంచిదే.. దెబ్బతిన్న నరాలు కోలుకునే చాన్సెస్​ ఉన్నయ్​!

నరాల బలహీనతను పోగెట్టే ఓ కిటుకు ఏంటో తెలిసిపోయింది. ఈ మధ్య జరిపిన పలు పరిశోధనల్లో ఈ విషయం కనుగొన్నారు వైద్య పరిశోధకులు. లండన్​లోని ఇంపీరియల్​ కాలేజీకి చెందిన కొంతమంది ఈ మధ్య ఎలుకలపై పలు పరిశోధనలు జరిపారు. అందులో ఉపవాసం ఉండడం వల్ల నరాల బలహీనత నుంచి బయటపడొచ్చనే అంశాలను కనుగొన్నట్టు తెలిపారు.

– డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

ఎలుకలపై నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. అడపాదడపా ఉపవాసం (Intermittent fasting) గట్ బ్యాక్టీరియా యొక్క గతిని మార్చేస్తుందని, ఇది నరాల బలహీనత నుంచి కోలుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఉపవాసం వల్ల గట్ బ్యాక్టీరియా, 3–ఇండోలె ప్రోపియోనిక్ యాసిడ్ (3 –Indole propionic acid) అని పిలువబడే మెటాబోలైట్ ఉత్పత్తిని ఎలా పెంచుతుందో గమనించారు. ఇది ఆక్సాన్స్ అని పిలువబడే నరాల ఫైబర్‌లను పునరుత్పత్తి చేయడానికి ఎంతో ఉపయోగపడుతున్నట్టు కనుగొన్నారు. — నరాల చివరల థ్రెడ్ లాంటి నిర్మాణాలు.. శరీరంలోని ఇతర కణాలకు ఎలక్ట్రో కెమికల్ సంకేతాలను పంపుతున్నాయని ఈ పరిశోధనల్లో వెల్లడైంది.

ఈ నావల్​ మెకానిజం ఎలుకలలో కనుగొన్నామని, ఫ్యూచర్​లో మానవుల్లోనూ ఇట్లాంటి ప్రయోగాలకు కూడా ఇది వర్తిస్తుందని తాము ఆశిస్తున్నామని పరిశోధకులు తెలిపారు. క్లోస్ట్రిడియం స్పోరోజెనిసిస్ అనే IPA (Indo lepropionic acid) ని ఉత్పత్తి చేసే బాక్టీరియా –మానవులు, ఎలుకల గట్‌లలో సహజంగా కనిపిస్తుందని  ఈ అధ్యయన బృందం పేర్కొంది. IPA (Indo lepropionic acid) మానవ రక్త ప్రవాహాలలో కూడా ఉంటుంది. “శస్త్రచికిత్స పునర్నిర్మాణానికి మించి నరాలు దెబ్బతిన్న వ్యక్తులకు ప్రస్తుతం వేరే ట్రీట్​మెంట్​ లేదు. ఇది తక్కువ శాతం కేసులలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. జీవనశైలి మార్పులు రికవరీకి సహాయపడతాయో లేదో పరిశోధించడానికి ఇది మమ్మల్ని ప్రేరేపిస్తోంది” అని ఇంపీరియల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ కు చెందిన ప్రొఫెసర్ సిమోన్ డి గియోవన్నీ చెప్పారు.

- Advertisement -

“అడపాదడపా ఉపవాసం గతంలో గాయం మరమ్మతు, కొత్త న్యూరాన్ల పెరుగుదలకు సంబంధించిన అంశాలను ఇతర అధ్యయనాల ద్వారా తెలుసుకున్నాం. -అయితే ఉపవాసం అనేది దెబ్బతిన్న నరాలను నయం చేయడంలో ఎలా సహాయపడుతుందో వివరించడానికి మా అధ్యయనం మొదటిది అవుతుంది” అని జియోవన్నీ తెలిపారు. తాము చేసిన అధ్యయనంతో ఎలుకలలో నరాల పునరుత్పత్తిని అంచనా వేయగలిగామని, ఇక్కడ తుంటి అనగా తొడ వెనుక భాగపు నరాలు, వెన్నెముక నుండి కాలు కిందికి నడిచే పొడవైన నరం నలిగింది. సగం ఎలుకలు అడపాదడపా ఉపవాసానికి లోనయ్యాయి.. (ప్రత్యామ్నాయ రోజులలో అస్సలు తినకుండా వాటికి నచ్చినంత తినడం ద్వారా).. మిగిలిన సగం ఎలుకలు ఎటువంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా తిన్నాయి. ఇట్లా ఆహారం ఇవ్వడం అనేది వాటి ఆపరేషన్‌కు ముందు 10 నుంచి 30రోజుల పాటు కొనసాగింది. నాడి తెగిపోయిన 24 నుండి 72 గంటల తర్వాత ఎలుకల కోలుకోవడం మేము గమనించాము అని గియోవన్నీ తెలిపారు.

అయితే.. మానవులలో కూడా ఉపవాసం తర్వాత IPA పెరుగుతుందా? IPA యొక్క సమర్థత, చికిత్సకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు, పరిశోధనలు చేయాల్సి ఉంది. మేము పూర్తిగా అన్వేషించని వాటిలో ఒకటి ఏంటంటే.. IPA రక్తంలో 4 నుండి 6 గంటల వరకు అధిక సాంద్రతలో ఉంటుంది.. కాబట్టి, దానిని రోజంతా సాధారణ ఆహారంలో చేర్చడం వలన దాని గరిష్ట స్థాయి ఎట్లుంటుంది. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మానవులలో నరాల బలహీనతను పోగొట్టేందుకు ఎట్లా సహాయపడుతుంది? అనే అంశాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది అని గియోవన్నీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement