Friday, November 22, 2024

Who is Great: దేశ ప్ర‌ధానుల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.. ఎవ‌రు ఎట్లాంటి వారంటే..

తెలంగాణ‌, ఏపీ విభ‌జ‌న‌పై పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోడీ చేసిన వ్య‌ఖ్య‌లు యావ‌త్ దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ నీయాంశంగా మారాయి. ఇప్పుడు ఎలాంటి సంద‌ర్భం లేకున్నా కావాల‌నే మోడీ తెలంగాణ‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నార‌ని, విభ‌జ‌న జ‌రిగి.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో పోటీప‌డుతుంటే.. చూసి త‌ట్టుకోలేకే మోడీ చ‌వ‌క‌బారు రాజ‌కీయం చేస్తున్నార‌ని ప‌లువురు లీడ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అంతేకాకుండా తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు ఇత‌ర రాష్ట్రాల‌కు మోడ‌ల్‌గా మారుతున్నాయ‌ని, ప‌లు రాష్రాలు ఇప్పుడు దేశానికి కేసీఆర్ లీడ‌ర్‌షిప్ అవ‌స‌రం ఉందంటూ కీర్తించ‌డం కూడా మోడీని మ‌న‌సున ప‌ట్ట‌కుండా చేస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టిదాకు ఉన్న ప్ర‌ధానుల్లో ఎవ‌రు ఎట్లాంటి వారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. వీరిలో జ‌వ‌హ‌ర‌ల్ లాల్ నెహ్రూని విజ‌న‌రీ ప్ర‌ధానిగా.. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రీని హార్డ్ వ‌ర్క‌ర్‌గా.. ఇందిరా గాంధీని స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్ట‌ర్ అని.. మ‌న్మోహ‌న్ సింగ్‌ని ఎడ్యుకేటెడ్ ప్రైమ్ మినిస్ట‌ర్ అని పేర్కొంటున్నారు.. అయితే ఇక్క‌డో ట్విస్టు ఉంది.. ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసిన వాటిల్లో చాల మ‌ట్టుకు ప్ర‌ధాని మోడీని ఎక్స‌లెంట్ మార్కెటింగ్ మేనేజ‌ర్‌గా మాత్ర‌మే జ‌నాలు గుర్తించిన‌ట్టు ట్వీట్లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మీరూ చూడండి..

https://twitter.com/supriyareddy124/status/1490944391288332288
Advertisement

తాజా వార్తలు

Advertisement