అంతర్ రాష్ట్ర నార్కో మాడ్యూల్ ని చేదించారు పోలీసులు. వారి వద్ద నుండి డ్రగ్స్.. నగదుని స్వాధీనం చేసుకున్నారు.పాకిస్థాన్ నుంచి పనిచేస్తున్న ఈ అంతర్రాష్ట్ర నార్కో మాడ్యూల్‌లోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను విక్రయిస్తారని, వాటి నుంచి వచ్చిన డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్ పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌కు చెందిన ఒక నార్కో స్మగ్లర్ మాదక ద్రవ్యాల సరుకును సేకరించడానికి జిల్లాలోని ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి వచ్చాడనే సమాచారంతో కుప్వారా పోలీసులు, స్థానిక ఆర్మీ యూనిట్‌తో కలిసి సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో యూసుఫ్ బోక్రా, షౌకత్ అహ్మద్ ఖతానా, మరూఫ్ అహ్మద్ మీర్, లాబా మసీహ్ అనే 4 మంది వ్యక్తులు అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురితో పాటు ఎనిమిది కిలోల హెరాయిన్, రూ. ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కుప్వారా సీనియర్ సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) యుగల్ మన్హాస్ తెలిపారు.దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement