Monday, November 25, 2024

ఇంటర్​ క్వశ్చన్​ పేపర్​ లీక్​.. కెమెస్ట్రీ పేపర్​ అవుట్​ పై దర్యాప్తు

ముంబైలో ఇంటర్ పరీక్ష‌ల్లో కెమిస్ట్రీ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు ఈ ఎగ్జామ్ కు ఆలస్యంగా రావ‌డంతో మ‌రింత అనుమానాలు కలిగాయి. పైగా కొందరి విద్యార్థుల ఫోన్‌లో పేపర్ లీకేజ్‌కు సంబంధించిన వివరాలు అబించ‌డంతో ఆ అనుమానాలు మ‌రింత బల‌మ‌య్యాయి. దీనిపై పోలీసుల దర్యాప్తు చేప‌ట్ట‌గా ప్రైవేట్ క్లాస్‌లు చెబుతున్న ముఖేష యాదవ్ అనే ఉపాధ్యాయుడు పేపర్ లీక్ చేసినట్టు తేలింది. పరీక్షకు ముందు తన ట్యూష‌న్ లో చ‌దువుతున్న‌ ముగ్గురు విద్యార్థులకు వాట్సాప్‌లో కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్‌ను షేర్ చేసిన‌ట్టు తెలిసింది. దాంతో విలేపార్లే పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేశారు. ప్రశ్నా పత్రం లీక్ చేసిన సమయంలో ముఖేష్ మలాడ్‌లో ప్రైవేట్ ట్యూషన్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఈ పేపర్ లీకేజ్ వెనుక ఎవరున్నారనేది పూర్తిగా తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement