Tuesday, November 26, 2024

Breaking: ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌.. 67.72శాతం ఉత్తీర్ణ‌త‌

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యంలో కార్య‌ద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ ఇవ్వాల (మంగ‌ళ‌వారం) సాయంత్రం ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను రిలీజ్‌ చేశారు. జ‌న‌ర‌ల్ కోర్సుల్లో 67.72 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, వోకేష‌న‌ల్ కోర్సుల్లో 57.28 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. జ‌న‌ర‌ల్ కోర్సు ప‌రీక్ష‌ల‌కు 2,20,456 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,49,285 మంది పాస‌య్యారు.

ఇక‌.. వొకేష‌న్ కోర్సు ప‌రీక్ష‌ల‌కు 18,955 మంది హాజ‌రు కాగా, 10,858 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు. కాగా, మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌లైన‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్‌లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 65.07శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement