తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి అధికారులు ఫుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఎగ్జామ్ సెంటర్లోకి ఒక్క నిమిషం లేట్‌గా వచ్చినా సరే.. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ఈ సూచనను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలని కోరారు. ఇక.. కొవిడ్, ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు ఉమర్ జలీల్. ఫలితాలు వచ్చిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 1,443 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎగ్జామ్స్ ఉదయం 9 నుంచి మ.12 గంటల వరకు..
ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఫస్టియర్ షెడ్యూల్
మే 6(శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 9(సోమవారం) – ఇంగ్లీష్
మే 11(బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 13(శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 16(సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 18(బుధవారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 20 (శుక్రవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
మే 23(సోమవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
=====================================
సెకండియర్ షెడ్యూల్
మే 7(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 10(మంగళవారం) – ఇంగ్లీష్
మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 14(శనివారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 17(మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 21 (శనివారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
మే 24(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
======================================