మహారాష్ట్రలోని ముంబైలో ఇంటర్ సెకండీయర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయ్యిందనే వార్త దావనంలా వ్యాపించింది. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల ఫోన్ లో పేపర్ లీకేజీకి సంబంధించిన వివరాలు లభ్యమయ్యాయి. పేపర్ లీకేజీకి ప్రధాన సూత్రధారి మలాడ్ లోని ఓ ప్రైవేట్ కోచింగ్ క్లాస్ టీచర్ విలేపార్లేను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రైవేట్ క్లాస్ టీచర్ పరీక్షకు ముందు తన ముగ్గురు విద్యార్థులకు లీకైన పేపర్ ను వాట్సాప్లో పంపినట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital