Tuesday, November 26, 2024

Ts | జూన్‌ 12 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. రీషెడ్యూల్‌ చేసిన ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ముందుగా ప్రకటించిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా తేదీలను మారుస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే అదే రోజున జూన్‌ 4న జేఈఈ పరీక్ష ఉండడంతో సప్లిమెంటరీ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసినట్లుగా అధికారులు బుధవారం ప్రకటించారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ జూన్‌ 5వ తేదీ నుంచి 9వరకు జరగనున్నాయి. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష జూన్‌ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జూన్‌ 22న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement