Wednesday, November 20, 2024

అంబేద్కర్ స్ఫూర్తి తోనే తెలంగాణలో సీఎం పాలన – మంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ – హ‌న్మ‌కొండ లోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోగ‌ల రాజ్యాంగ ర‌చ‌యిత అంబేద్క‌ర్ విగ్ర‌హానికి ..ఆయన జయంతి సందర్భంగా పూల మాల వేసి, పుష్పాంజ‌లి ఘ‌టించారు ‌రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు. ఈ కార్య‌క్ర‌మంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్, హన్మకొండ ఇంచార్జీ కలెక్టర్ గోపి, కుడా వైస్ చైర్ పర్సన్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంత‌రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు..అంబేద్కర్ అపర మేధావి..రాజ్యాంగ రూపకర్త.. అంటరాని తనం రూపు మాపిన సంఘ సంస్కర్త..దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడు…అంబేద్కర్ స్ఫూర్తి తోనే తెలంగాణలో సీఎం పాలన..దళితుల ఆత్మ బంధువు సీఎం కెసీఆర్..అంబేద్కర్ తర్వాత దేశంలో దళితుల గురించి ఆలోచించిన వ్యక్తి, నేత కేసిఆర్ మాత్రమే..దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నాం..అంబేద్కర్ కేవలం దళితుల వాడు మాత్రమే కాదు, ఆయన అందరి వాడు..అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కెసిఆర్ లక్ష్యం..ద‌ళితుల అభివృద్ధి కోసం ప్ర‌త్యేక చ‌ట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ ను ఏర్పాటు చేసింది.. ద‌ళిత విద్యార్థుల కోసం ప్ర‌త్యేక గురుకులాలు ఏర్పాటు చేసి, నాన్య‌మైన విద్య‌నందిస్తున్నం..అంబేద్క‌ర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశాల్లో చ‌దువుకునే వాళ్ళ కోసం ఒక్కొక్క‌రికి 20 ల‌క్ష‌ల స‌హాయం చేస్తున్న‌ది..బడ్జెట్ లో 17 వేల 700 కోట్లు కేటాయించారు ..అనేక అంశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement