మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో నలుగురు పిల్లలు సజీవదహనమయ్యారు.
ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది పిల్లలున్నారు. 36 మంది చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: సుందర కాశ్మీరం.. శ్రనగర్‌కు యునెస్కో గుర్తింపు..