Friday, November 22, 2024

ప‌రిశ్ర‌మ‌ల ప‌రుగు..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – బహుళజాతి పారిశ్రామిక సంస్థలన్నీ తమ తదుపరి పెట్టుబడి లక్ష్యాలకు కేంద్రంగా భారత్‌ను ఎంచుకుంటు న్నాయి. ఆయా దేశాల్లోని రాజకీయ, ఆర్థిక సుస్థితరత, అహింసావాదం, యుద్ధోన్మాదానికి దూరంగా ఉండడం వంటి అంశాల్ని ఈ పారిశ్రామిక సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. రెండేళ్ళ కొవిడ్‌ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొంది. పలు పరిశ్రమలు కుదేలయ్యాయి. ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో అట్టుడికాయి. కొవిడ్‌ నష్టాల నుంచి నెమ్మదిగా కోలుకుం టున్న దశలో ఉక్రెయిన్‌ పై రష్యా దండెత్తింది. ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటైన రష్యా అతిచిన్న దేశం ఉక్రెయిన్‌పై చేపట్టిన సైనిక చర్య కేవలం కొన్నివారాల్లోనే తుది దశకు చేరుకుంటుందని అంచనాలేశారు. కానీ యుద్ధం మొదలై ఏడాది గడిచినా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రసరించింది. తిరిగి ఆర్థిక మాంద్యం పంజా విసిరింది. కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థలు మళ్ళీ నిర్వీర్యమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిపై ఇది ప్రభావం చూపింది. కొన్ని దేశాలైతే ఆర్థికంగా దివాళా తీశాయి. మరికొన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. మరికొన్ని తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాల్ని ఎదుర్కొంటున్నాయి. కానీ కొవిడ్‌ కాలంతో పాటు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో కూడా భారత్‌ తన ఆర్థిక సుస్థిరతను ఏమాత్రం కోల్పోలేదు. పైగా గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశా లన్నీ ఇటు రష్యా లేదా అటు నాటో కూటమికి అను కూలంగా చీలిపోయాయి. కానీ భారత్‌ తన సుస్థిర విధా నాన్ని కొనసాగించింది. స్వతంత్య్ర నిర్ణయాలకు కట్టు బడింది. అమెరికా, ఐరోపా సమాజాల ఆదేశాల్ని ఏమాత్రం లెక్కచేయలేదు. ఈ యుద్ధ నేపథ్యంలో కూడా భారత్‌ పెద్దెత్తున ప్రయోజనాల్ని సాధించింది. ఈ అంశమే ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదార్లకు భారత్‌ ను తమ తదుపరి పెట్టుబడుల కేంద్రంగా నిర్దేశిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా-చైనాల మధ్య విబేధాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

అమెరికా ఆధిపత్యాన్ని అడుగడుగునా చైనా సవాల్‌ చేస్తోంది. ప్రపంచ అగ్రస్థానానికి ఎదగాలని చైనా ఉవ్విళ్ళూరుతోంది. ఇప్పటికే పారిశ్రామికంగా చైనా ముందంజలో ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. చైనా, అమెరికాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా పరోక్ష యుద్ధం సాగుతూనే ఉంది. పెట్టుబడిదారి వ్యవస్థగా చైనా ఆవిర్భవించిన అనంతరం ఈ పరోక్ష యుద్ధం ప్రత్యక్ష స్థాయికి మారింది. ఏదొక రోజున ఇరుదేశాల మధ్య యుద్ధం తప్పదన్న అంచనాలు పెరిగాయి. ఇందుకు తగ్గట్లే సైనిక సంఖ్యతో పాటు అత్యాధునిక ఆయుధాల సమీకరణలో ఇరుదేశాలు పోటీలు పడుతున్నాయి. ఒకవేళ చైనా-అమెరికాల మధ్య యుద్ధం అంటూ సంభవిస్తే అది ఏళ్ళ తరబడి కొనసాగే ప్రమాదముందని ప్రస్తుత ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ బలమైన రాజ్యం ఓ చిన్న దేశంపై ప్రారంభించిన యుద్ధం ఏడాదైనా పూర్తికాలేదు. అలాంటిది రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధమే సంభవిస్తే అది రెండు దేశాల వినాశనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. దీంతో చైనాలో పెట్టుబడులు పట్ల పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొంది. ఇది దీర్ఘకాల ప్రయోజనాలకు సరికాదన్న అభిప్రాయం ఏర్పడింది. గతకొంతకాలంగా చైనాలో పెట్టుబడులు పెట్టిన బహుళ జాతీయ సంస్థలు ఇప్పుడు భారత్‌వైపు ఆకర్షితులు కావడానికి ఇది కూడా మరో కారణం.


తాజాగా ఫాక్స్‌కాన్‌ సంస్థ భారత్‌లో 700మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైంది. ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌ విడిభాగాల తయారీదారు. యాపిల్‌ ఫోన్‌లో వినియోగించే విడిభాగాల్లో 38శాతం ఈ ఫాక్స్‌కాన్‌ సంస్థ తయారుచేస్తుంది. ఈ సంస్థ కర్ణాటకలోని బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మూడొందల ఎకరాల స్థలంలో ఈ ఐఫోన్‌ విడిభాగాల పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందులో కొత్తగా లక్షమందికి ప్రత్యక్షంగా, మరో రెండులక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దేశంలో గతంలో కూడా ఫాక్స్‌కాన్‌ కొన్ని పెట్టుబడులు పెట్టింది. గుర్గావ్‌, హైదరాబాద్‌లలో కూడా కొన్ని పరిశ్రమల్ని నెలకొల్పింది. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ వీటన్నింటికంటే పెద్దది.

వాస్తవానికి అమెరికా తర్వాత భారత్‌ను తమ అతిపెద్ద తయారీ కేంద్రంగా మార్చుకోవాలని ఐ ఫోన్‌ తయారీదారు యాపిల్‌ సంస్థ దీర్ఘకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ అమెరికాతో పాటు చైనా, మెక్సికో, వియత్నం, దేశాల్లో ఐ ఫోన్లను తయారు చేస్తోంది. కాగా భవిష్యత్‌లో చైనాకంటే భారత్‌లో పెట్టుబడుల విస్తరణకు వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐ ఫోన్‌ ఉత్పత్తుల్లో ఐదు శాతాన్ని భారత్‌లోనే తయారు చేసేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. కాగా 2025నాటికి తమ మొత్తం ఐ ఫోన్ల ఉత్పత్తిలో 25శాతాన్ని భారతదేశంలో తయారు చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే చెన్నై శివార్లలో ఒక తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. దీన్ని విస్తరించేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది.
ప్రోత్సాహకాలతో పెట్టుబడిదారులకు భారత్‌ దన్ను
భారత్‌ను ఉత్పాదక కేంద్రంగా మార్చాలని ప్రధాని మోడి సంకల్పించారు. ఇందుకోసం ఇక్కడికొచ్చే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాల్ని అందిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, సాఫ్ట్‌ వేర్‌ రంగాల్లో విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటీవ్స్‌ పథకాన్ని ప్రకటించింది. దీంతో తైవాన్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ రూ.1.63 లక్షల కోట్ల వ్యయంతో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చింది. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమల ప్రయోజనాల కోసం ఆర్థికపర ప్రోత్సాహకాలతో పాటు అంతర్జాతీయంగా ద్వైపాక్షిక ఒప్పందాల్ని కూడా మోడి ప్రభుత్వం కుదుర్చుకుంటోంది. తద్వారా ప్రపంచ స్థాయి సరఫరా గొలుసులో భారత్‌ను ఓ భాగం చేస్తోంది. గతంలో ఒప్పందాల్ని కుదుర్చుకోవడంలో భారత్‌ నత్తనడకన నడుస్తోందన్న భావనుండేది. మోడి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆ భావన పూర్తిగా తొలగిపోయింది.

చైనా చర్యలతో బహుళజాతి సంస్థల్లో అభద్రతాభావం అదే సమయంలో గతేడాది చైనా వార్షిక వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అంతర్జాతీయంగా చైనా ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. అమెరికా ఉత్పత్తులతో చైనా పరిశ్రమలకు పోటీ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే చైనా మారకం యువాన్‌ విలువ దారుణంగా పడిపోయింది. చైనా కరెన్సీ బలహీనపడ్డం కూడా అంతర్జాతీయ మదుపరులు భారత్‌ వైపు ఆకర్షితులు కావడానికి ఓ కారణం. చైనాలో ప్రైవేటు పెట్టుబడులపై ఆ ప్రభుత్వం పట్టు పెంచింది. మదుపరుల్ని పలురకాలుగా వెంటాడుతోంది. అలీబాబా వ్యవస్థాపకుడి పట్ల చైనా ప్రభుత్వం అనుసరించిన తీరు కూడా విదేశీ పెట్టుబడిదార్లలో భయం కల్పించింది. ఈ కారణంగానే అలీబాబా నుంచి జపాన్‌ సాఫ్ట్‌బ్యాంక్‌ తమ వాటాల్ని ఉపసంహరించుకుంది. అలాగే చైనాలోని వాహనాల తయారీ సంస్థ బీవైడీ నుంచి అమెరికాకు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కూడా గతేడాది తమ పెట్టుబడుల్ని తిరిగి తీసుకుంది. టెన్‌సెంట్‌ కూడా చైనాలోని తన పెట్టుబడుల నుంచి గతేడాది రూ.57 వేల కోట్లు ఉపసంహరించుకుంది. ఇవన్నీ చైనా పట్ల అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన బహుళజాతి సంస్థల్లో నెలకొన్న అభద్రతా భావానికి అద్దంపడుతున్నాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల పట్ల విశ్వాసాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి.బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు కలిసి ఆడిన రోహన్‌ బోపన్న, ఇవాన్‌ డోడిగ్‌, బెతానీ మాటెక్‌ సాండ్స్‌, కారా బ్లాక్‌, మరియన్‌ బర్తోలీతో కలిసి ఆదివారం ఎల్బీ టెన్నిస్‌ స్టేడియంలో సానియా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడనుంది. దుబాయ్‌లో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీ ద్వారా రిటైర్‌ అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన సానియా తన అకాడమీలో మీడియాతో మాట్లాడింది. ‘కెరీర్‌లో నేను ఊహించిన దాని కంటే ఎక్కువ సాధించాను. కోర్టులో గడిపిన ప్రతీ క్షణం మరిచిపోలేనిది. ఒలింపిక్స్‌లో పతకం గెలువకపోవడం నా కెరీర్‌లో తీరని లోటు. నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో సొంత అభిమానుల మధ్య ఆడి కృతజ్ఞతలు తెలుపాలనుకుంటున్నాను. ఎక్కడ మొదలు పెట్టానో తిరిగి అక్కడికే రావడం గొప్పగా అనిపిస్తున్నది’ అని సానియా పేర్కొంది. ఇదిలా ఉంటే జూనియర్‌ వింబుల్డన్‌ టైటిల్‌ గెలువడం జీవితంలో మరిచిపోలేని సందర్భమని సానియా గుర్తుకు తెచ్చుకుంది. హైదరాబాద్‌లో తనకు లభించిన స్వాగతం జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది. త‌న రిటైర్మెంట్ త‌ర్వాత యువ క్రీడాకారుల‌కు శిక్ష‌ణ ఇస్తాన‌ని పేర్కొంది.. ఇక ఎక్కువ స‌మ‌యం త‌న కుమారుడితో గ‌డుపుతాన‌ని వెల్ల‌డించింది..త‌న ఎదుగుద‌ల‌లో స‌హ‌కరించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కోచ్ ల‌కు, స‌హ‌చ‌ర క్రీడాకారుల‌కు, స్పాన్స‌ర్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement