ఈరోజు తెల్లవారు జామున మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.5 గా నమోదయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటన చేసింది. భూకంపం రావడంతో భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇండోర్ కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించింది. భూమిలో ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement