భారీ భూకంపాలు సంభవించినప్పుడు సాధారణంగా సునామిలు కూడా వస్తుంటాయి. కాగా ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. తూర్పు ఇండోనేషియాలో రిక్టర్ స్కేల్ పై 7.3తీవ్రతతో భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. 2004లో ఇండోనేషియాలో చివరిసారిగా సునామీ సంభవించింది. డిసెంబర్ 26న వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత సునామీ రావడంతో.. ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్‌తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 2,20,000 మంది చనిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్రజలే 1,70,000 ఎక్కువగా మరణించారు.
కాగా మౌమెరే పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోర్స్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలిపింది. భారీ భూకంపం చోటుచేసుకున్న నేపథ్యంలో ఇండోనేషియా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం కూడా ఇలాంటి హెచ్చరికలే జారీచేసింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ లోపు తీర ప్రాంతాల్లో ప్రమాదకర అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..