Friday, November 22, 2024

భార‌త తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ.. ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన తొలి మ‌హిళామ‌ణులు ఎవ‌రంటే!

కాంగ్రెస్ అధినేత్రి, ఐర‌న్ లేడీగా పేరుగాంచిన ఇందిరా గాంధీ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఇవ్వాల దేశ వ్యాప్తంగా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ స‌మాధి వ‌ద్ద పార్టీ ముఖ్య నాయ‌కురాలు సోనియా గాంధీ, ఇందిరా మ‌నుమ‌రాలు ప్రియాంకా గాంధీ వాద్రా నివాళుల‌ర్పించారు. అట్లానే భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్న రాహుల్ గాంధీ నాన‌మ్మతో త‌న‌కు ఉన్న‌ జ్ఞాప‌కాల‌ను ప‌లువురితో పంచుకున్నారు. చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. ఇక‌.. ప‌లువురు పార్టీ లీడ‌ర్లు కూడా ఇందిరా గాంధీ చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు..

అయితే.. వీటిని భిన్నంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి త‌న‌యుడు ప‌ట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మాత్రం ఓ వినూత్న అంశాన్ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. కార్తీక్‌రెడ్డి పోస్టు చేసిన విష‌యం ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో విప‌రీతంగా షేర్ అవుతోంది. దేశంలో తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ అని కోట్ చేస్తూ చేసిన ఈ ట్వీట్‌లో యూపీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఎన్నో వివ‌రాలున్నాయి. మీరూ చ‌ద‌వి ఈ విష‌యాల‌ను గుర్తుంచుకుంటార‌ని ఆశిస్తున్నాం..

Advertisement

తాజా వార్తలు

Advertisement