ఈ మధ్యకాలంలో ఇండిగో విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. కాగా అరబ్ దేశాల నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం ఉన్నట్టుండి పాకిస్థాన్ నగరం కరాచీ వైపు మళ్లింది.ప్రయాణికులతో షార్జా నుంచి వస్తున్న ఈ విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్ ఆ విమానాన్ని కరాచీ వైపు మళ్లించాడు. ఆపై కరాచీ ఎయిర్ పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు.
ఈ ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ వివరణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే పైలట్ విమానాన్ని కరాచీలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడని ఆ సంస్థ వెల్లడించింది. కరాచీలో దిగిన ప్రయాణికుల కోసం మరో విమానాన్ని పంపుతున్నట్లు ఇండిగో వెల్లడించింది. రెండు వారాల వ్యవధిలోనే భారత్‌కు వస్తూ ఇలా భారత్‌కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ కావడం ఇది రెండో సారి కావడం గమనార్హం.