Wednesday, November 20, 2024

Breaking: ఢిల్లీ టెస్ట్ లో భార‌త్ ఘ‌న విజ‌యం..

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 115 పరుగుల టార్గెట్ ను టీమిండియా అవలీలగా ఛేదించింది. ఆస్ట్రేలియాపై 4 వికెట్లు కోల్పోయి… విజయం సాధించింది టీమిండియా. ఇక టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 31 పరుగులు, పూజార 31 పరుగులు, కే ఎస్ భరత్ 23 పరుగులు, కింగ్ కోహ్లీ 20 పరుగులు, శ్రేయస్ అయ్యర్‌ 12 పరుగులు చేశారు. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్ అద‌ర‌గొట్టింది. దీంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 లీడ్‌ సాధించింది. వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో భారత్ జట్టు టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement