Monday, November 18, 2024

Spl Story: జాబ్స్​ లేవు, ఉపాధి లేదు.. నాలుగేళ్లలో దేశ పరిస్థితి దారుణం, కేంద్ర సర్వే వెల్లడి!

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. నాలుగేళ్ల నుంచి క్రమంగా నిరుద్యోగిత రేటు తగ్గుతూ వస్తుండగా.. అది ఈ రెండేళ్లలో ఘోరంగా పరిణమించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పీరియాడిక్​ లేబర్​ ఫోర్స్​ సర్వే (PLFS) ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో లేబర్​ ఫోర్స్​ పార్టిసిపేషన్​ రేట్​ (LFPR), వర్కర్​ పాపులేషన్​ రేషియో (WPR), నిరుద్యోగిత రేటు (UR) వంటి కీలకమైన ఉపాధి, నిరుద్యోగ సూచికల అంచనాలను ఇది అందజేస్తుంది. దేశంలోని 5,271 ఆవాసాలు, 44,600 కుటుంబాలు, 1,73,271 మందిని నాలుగు దఫాలుగా కలిసి ఈ సర్వే నిర్వహించారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

దేశంలో నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. ఈ రెండేళ్లలో నిరోద్యిగ రేటు మరింత దిగజారినట్టు పలు సర్వేలు వెల్లడి చేస్తుంటే.. ఏకంగా కేంద్ర గణాంకాలు, ప్రోగ్రామ్​ అమలు వంటి అంశాలపై సర్వే చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఇదే వివరాలను వెల్లడిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు.. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం.. భారతదేశ పట్టణ నిరుద్యోగిత రేటు 2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.6 శాతానికి పడిపోయింది. ఇది నాలుగేళ్లలో కనిష్ట స్థాయిగా తెలుస్తోంది. ఇక2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తుల నిరుద్యోగిత రేటు 12.6 శాతంగా ఉంది. గడిచిన నాలుగు త్రైమాసికాల్లో ఇది మరింతగా తగ్గుతూ వస్తోందని కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

2021 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగిత రేటు 9.8 శాతానికి పడిపోయింది. ఇది అక్టోబర్-డిసెంబర్ 2021 కాలంలో 8.7 శాతానికి పడిపోయింది. 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో 8.2 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగిత రేటు 7.6 శాతానికి పడిపోయింది. ఇది వరుసగా నాలుగో త్రైమాసికంలో కూడా తగ్గుతూ వచ్చింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభించిన తర్వాత దేశంలో ఇదే అత్యల్ప నిరుద్యోగిత రేటుగా చెప్పుకోవచ్చు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) అనేది.. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (LFPR), వర్కర్ పాపులేషన్ రేషియో (WPR), నిరుద్యోగిత రేటు (UR) మొదలైన కీలక ఉపాధి.. నిరుద్యోగ సూచికల అంచనాలను అందిస్తుంది.

అఖిల భారత స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో 2022 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో మొత్తం 5,721 ఆవాసాలు (UFS బ్లాక్‌లు) సర్వే చేశారు. సర్వే చేసిన పట్టణ కుటుంబాల సంఖ్య 44,660గా ఉంది. సర్వే చేసిన వ్యక్తుల సంఖ్య 1,73,271గా ఉంది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం పట్టణ ప్రాంతాల్లో గణాంకాలు & ప్రోగ్రామ్ అమలు వంటి అంశాలు ఉన్నాయి..

- Advertisement -

2022 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి కేటాయించిన నమూనాలకు సంబంధించి సమాచార సేకరణ కోసం ఫీల్డ్ వర్క్ మొదటి సందర్శన నమూనాల కోసం 04.07.2022 నాటికి, రీవిజిట్ నమూనాల కోసం 30.06.2022 నాటికి పూర్తయింది. నమూనాల వాస్తవ రిఫరెన్స్ పీరియడ్‌ల ప్రకారం, 2020 జూన్ నుండి టెలిఫోనిక్ మోడ్‌లో రీవిజిట్ షెడ్యూల్‌ల కాన్వాసింగ్ కొనసాగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, కోవిడ్ వైరస్ విసృతంగా ఉన్న క్రమంలో నిబంధనల మేరకు సమాచారసేకరణలో భాగంగా భౌతికంగా వారిని కలవకుండా టెలిఫోనిక్ మోడ్‌ని అవలంబించారు. ఇక.. 2022 ఏప్రిల్-జూన్ నాటికి సంబంధించి 95.40 శాతం రీవిజిట్ షెడ్యూల్‌ల కోసం టెలిఫోన్ ద్వారా సమాచారం సేకరించారు.

పట్టణ ప్రాంతాల్లో ఈ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. ఎంపిక చేసిన ప్రతి ఇంటిని నాలుగు సార్లు సందర్శించారు. ప్రారంభంలో మొదటి సందర్శన షెడ్యూల్ సందర్భంగా మూడుసార్లు కాలానుగుణంగా తర్వాత రీవిజిట్ షెడ్యూల్​తో  రొటేషన్ పద్ధతిలో చేశారు. ఈ క్రమంలో మొదటి దశ నమూనా యూనిట్లలో 75 శాతం వరుసగా రెండు సందర్శనల మధ్య సర్వే రిపోర్టుల వివరాలు సరిపోలినట్లు మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement