Saturday, November 23, 2024

ఇండియాలో అత్యంత వృద్ధ బిలియ‌నీర్.. కేషుబ్ మ‌హీంద్రా క‌న్నుమూత‌

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎమెరిట‌స్ చైర్మ‌న్.. ఇండియాలో అత్యంత వృద్ధ బిలియ‌నీర్ కేషుబ్ మ‌హీంద్రా క‌న్నుమూశారు.ఆయ‌న వ‌య‌సు 99ఏళ్లు.ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ లిస్ట్ 2023లో కేషుబ్‌ మహీంద్రా చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో భారతదేశంలో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఆయన నిలిచారు. కాగా ఆయ‌న క‌న్నుమూసిన‌ విషయాన్ని మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల మాజీ ఎండీ పవన్ కె గోయెంకా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పారిశ్రామిక ప్రపంచం నేడు అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయింది’ అంటూ సంతాపాన్ని ప్రకటించారు. విషయం తెలుసుకున్న పలువురు వ్యాపారవేత్తలు కేషుబ్ మహీంద్రా మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం మహీంద్రా అండ్‌ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహేంద్ర మేనమామే కేషుబ్‌ మహీంద్ర. ఆయన అక్టోబర్‌ 9, 1923లో సిమ్లాలో జన్మించారు. యూఎస్‌లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1947లో మహీంద్రా గ్రూప్‌లో చేరిన కేషుబ్‌.. 1963లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు కంపెనీకి నాయకత్వం వహించిన ఆయన.. ఆగస్టు 2012లో చైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విమరణ అనంతరం.. వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రా గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement