Thursday, November 21, 2024

రేటు పెరిగినా తగ్గేదేలే.. ముడి చమురు దిగుమతి పెంచిన రిఫైనరీలు.. డీజిల్​ అమ్మకాలూ డబుల్​

కరోనా భయం తగ్గుముఖం పట్టడం.. ఒమిక్రాన్​ వేరియంట్​ అంత ప్రభావం చూపకపోవడంతో ఇక జనాలు రోడ్లమీద ఇష్టమున్నట్టు తిరుగుతున్నారు. దీంతో వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా ఆపీసులు, స్కూళ్లు, కాలేజీలు.. ఓపెన్​ అవుతుండడంతో రోడ్ల మీద తిరిగే బండ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో పెట్రోల్​, డీజిల్​ ​ వాడకం అంతకంతకూ ఎక్కువవుతోంది. కాగా, డిమాండ్​ను దృష్టిలో పెట్టుకుని చమురు శుద్ధి సంస్థలు వాటి వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేందుకు ఆయల్​ దిగుమతులను పెంచుకుంటున్నాయి.  క్రూడాయిల్​ రేట్లు పెరిగే చాన్స్​ ఉందన్న కారణంగా కూడా స్టాక్​ పెద్ద ఎత్తున్న తెప్పిస్తున్నట్టు తెలుస్తోంది.  

ప్రపంచంలోని మూడో అతిపెద్ద దిగుమతిదారుగా ముడి చమురు శుద్ధి చేసే సంస్థలున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌కు 100 డాలర్లు ఉన్నా దిగుమతులను ఏమాత్రం తగ్గించడం లేదు.  దేశంలోని 23 రిఫైనరీల్లో కనీసం 18 సంస్థలు గత నెలలో 100%కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేసినట్టు తెలుస్తోంది. ప్లాంట్లలో సగటు రన్ రేట్లు డిసెంబర్‌లో 101% ఉండగా.. ఆగస్టులో 87% మాత్రమేనని పరిశీలకులు చెబుతున్నారు.  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాసెస్​ కంపెనీలు అయిన.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ , హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ – వంటివి సౌదీ అరేబియా, ఇరాక్‌తో సహా టర్మ్ -కాంట్రాక్ట్ సరఫరాదారులను అదనపు బ్యారెల్స్ లేదా స్పాట్ మార్కెట్‌లో కొనుగోలు పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్ట అధికారులు తెలిపారు.

దేశం యొక్క ప్రాసెసింగ్ సామర్థ్యంలో 65% వాటా కలిగిన మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌తో పాటు మరో పెద్ద సంస్థలు.. మార్చి నుండి ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ఉత్పత్తి లక్ష్యాల కంటే వెనుకబడి ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో కరోనా వైరస్​ ప్రభావంతో  వీటి ఇంధన డిమాండ్‌ దెబ్బతిన్నదనే చెప్పవచ్చు. కాగా, చమురు దిగుమతులు గత డిసెంబరులో ఏడాది కాలంలోనే అత్యధికంగా పెరిగాయి.  డీజిల్, గ్యాసోలిన్ వినియోగంపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపినప్పటికీ ఈ సంవత్సరం చమురు దిగుమతులు పెరిగడంతోపాటు దేశీయంగా ఇంధన విక్రయాలు రెట్టింపు అయ్యాయి.

దేశంలో అతిపెద్ద రిఫైనర్ అయిన ఇండియన్ ఆయిల్ కంపెనీ రానున్న మార్చి, ఏప్రిల్ నెలల కోసం స్పాట్ కొనుగోళ్లు చేపడుతుంది. అంతేకాకుండా హిందూస్థాన్ పెట్రోలియం తన ముంబై ప్లాంట్‌లో రోజుకు 40వేల బ్యారెల్‌ల ముడి చమురు నిల్వలు ఉండేలా విస్తరించింది. అంటే మరింత ముడి చమురు కొనుగోలు చేయాల్సి ఉందని ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ కుమార్ సురానా చెప్పారు. దేశంలో అత్యంత వినియోగంలో ఉన్న డీజిల్‌ను తయారు చేయడం వల్ల అధిక లాభాలు ఆర్జించవచ్చని పలు రిఫైనరీలు ఉత్పత్తిని డబుల్​ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ రెండు సంవత్సరాల్లో ఆసియా, యూఎస్‌లో ఇంధన అమ్మకాలు కూడా డబుల్​ అయ్యాయని మార్కెట్​ అనలిస్టులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement