భారతదేశపు మొదటి కరోనా వేరియంట్ XE కేసు ఈ రోజు ముంబైలో నమోదైందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. కప్పా వేరియంట్‌కు సంబంధించిన ఒక కేసు కూడా కనుగొనబడింది. వైరస్ కొత్త వైవిధ్యాలతో ఉన్నప్పటికీ.. రోగులకు ఇప్పటివరకు ఎటువంటి తీవ్రమైన లక్షణాలు లేవు. కరోనా వేరియంట్ XE పాజిటివ్ వచ్చిన ముంబై రోగి 50 ఏళ్ల కాస్ట్యూమ్ డిజైనర్.. ఆమే ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుండి తిరిగి ఇండియాకి వచ్చింది. మార్చి 2న కోవిడ్ టెస్ట్ చేసుకోగా ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని BMC తన ప్రకటనలో తెలిపింది.
2022వ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే UKలో ఈ వేరియంట్ కనుగొనబడింది. XE వేరియంట్ మొదటిసారిగా జనవరి 19న కనుగొనబడిందని.. దేశంలో ఇప్పటివరకు 637 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయని బ్రిటన్ ఆరోగ్య సంస్థ తెలిపింది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..