దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష దాటాయి. నమోదయ్యాయి. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 30,836 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటి వరకు 3,43,71,845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ తో ఇప్పటివరకు మొత్తం 4,83,178 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 3,71,363 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 94,47,056 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 149.66 కోట్లకు చేరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..