టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆశలన్నీ అప్ఘనిస్తాన్ పైనే ఉన్నాయి. ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. టీమిండియా భవితవ్యం అఫ్గాన్‌పై ఆధారపడి ఉంది. కివీస్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ముందంజ వేస్తుంది. సోమవారం నాటి నమీబియా-భారత్ మ్యాచ్ నామమాత్రంగా మారుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా భారత్ ఖాతాలో ఆరు పాయింట్లే ఉంటాయి. ఒకవేళ అఫ్గానిస్థాన్ గెలిస్తే.. భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో నలుగురు అఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
అప్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, హజ్రతుల్లా జజాయ్ కీలకమైన ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిలో రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడుతున్నాడు. టీ20 క్రికెట్‌లో రషీద్‌కు ఉన్న అనుభవంతో ఈ మ్యాచ్‌లో రాణించాలని టీమిండియా అభిమానులు కోరుతున్నారు.