న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఆక్స్‌ఫర్డ్ అకడమిక్ అధ్యయన నివేదిక మేరకు అమెరికా జనాభాలో భారతీయ వలస దార్ల సంఖ్య ఒక శాతానికి లోపే. అయితే సిలికాన్‌వ్యాలీలో హైటెక్ కంపెనీల వ్యవ స్థాపకుల్లో 8శాతం భారతీయ వల సదార్లున్నారు. ఇక టెక్నాలజీ స్టార్టప్‌ల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయ వల సదారుడే. అంతేకాదు.. శ్వేత అమెరికన్ జాతీయుల కంటే భారత్ నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల ఆదాయం అధి కంగా ఉం టోంది. సగటు అమెరికన్ల ఆదాయంతో పోలిస్తే భార తీయ వలసదార్ల ఆదాయం 31శాతం ఎక్కువగా నమోదౌతోంది. అమెరికాలో ప్రస్తుతం వలస భార తీయుల సగటు ఆదాయం 120వేల డాలర్లు. ఇది శ్వేత అమెరికన్ల సగటు ఆదాయం కంటే దాదాపు 33శాతం ఎక్కువ. భారతీయ వలసదార్ల సగటు ఆదా యంతో పోలిస్తే సగం మంది సగటు ఆదాయంతో పోలిస్తే శ్వేత అమెరికన్లలో సగం మందికి పైగా సగం లోపే అక్కడ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. అమెరికాలోని శ్వేత జాతీయుల్లో 13 శాతం పేదరికంలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా వలస భారతీయుల్లో మాత్ర ం ఆరుశాతం మందే పేదరికంలో ఉన్నారు. అలాగే అమెరికాలోని అత్యున్నత వ్యాపార, పారి శ్రామిక సంస్థల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులే కీలకపదవుల్ని అధిష్టిసు ్తన్నారు. ఇప్పుడు శ్వేత అమెరి కన్లకు కూడా వలసొచ్చిన భారతీ యులు రోల్ మోడల్స్‌గా రూపుదిద్దుకున్నారు.
12ఏళ్ళ వయసులోనే ఇరాన్ నుంచి అమెరికాకు శరణార్థిగా వచ్చిన డేవిడ్ అనే వ్యక్తి ఇప్పుడు 34ఏళ్ళలో అమెరికా పౌరసమాజ జీవన విధానాల్ని విశ్లేషిస్తూ పలు వీడియోల్ని రూపొందిస్తున్నాడు. ఇవి అటు అమెరికా ఇటు భారత్‌లో కూడా మంచి ప్రజా దరణ పొం దుతున్నాయి. ఇటీవల డేవిడ్ వలస భార తీయులపై ఓ వీడియో రూపొందించారు. అమె రికాలోనే పుట్టి అక్కడే స్థిరపడి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కని పెంచుతున్న వారితో పోలిస్తే భారత్ నుంచి వలసెళ్ళి తమ పిల్లలకు అమెరికాలో విద్యా బుద్దులు చెప్పిస్తున్న తల్లిదండ్రుల తీరులో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు డేవిడ్ తన వీడియోల్లో సోదా హరణంగా పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణాల్ని కూడా ఆయన విశ్లేషించారు. సొంత గడ్డపై అమెరికన్ల కంటే వలసెళ్ళిన భారతీయులే ఎక్కువ సుఖంగా జీవిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం. వారు దేశం నుంచి వెళ్ళినా భారతీయ సాంస్కృతిక విలువల్ని మర్చిపోవడంలేదు. పుట్టుకతో వచ్చిన ఆధ్యాత్మిక భావనల్ని పక్కన పెట్టడం లేదు. అమెరికన్లతో పోలిస్తే వలసవాద హిందువుల్లో భార్యభర్తలు విడిపోవడం చాలాతక్కువ. ఓ అధ్యయనం మేరకు శ్వేత అమెరి కన్లలో 38శాతం మంది తమ పిల్లలకు 12ఏళ్ళు వచ్చే లోపే విడా కులు తీసుకుంటున్నారు. అదే వలసెళ్ళిన భారతీయుల్లో విడాకులు తీసుకునే వారి సం ఖ్య 1.28 శాతం మాత్రమే. తల్లిదండ్రులిద్దరూ కలసుండడం, కలిసే పిల్లల్ని పెంచడం భారతీయ సంస్కృతి సంప్ర దాయాల్ని పిల్లలకు బోధిం చడం కారణంగా వారిలో విద్య పట్ల ఆసక్తి, అవగాహన అధికంగా ఉంటోంది. అలాగే సమాజం పట్ల ఓ చైతన్య స్ఫూర్తి ఏర్పడుతోంది. కుటుంబ విలువలు, బాంధవ్యాలు ఎక్కువగా ఉంటు న్నాయి. ఇది వారిలో విద్యా వికాశానికి తోడ్ప డుతోంది. వివిధ రంగాల్లో వారు రాణించగలు గుతున్నారు. అమెరికన్ల కంటే మెరుగైన పనితీరును సామర్థ్యాన్ని కనబర్చగలుగుతున్నారు.
అదే శ్వేత అమెరికన్లలో దంపతులు విడివడ్డాక పిల్లలకు అటు తల్లో ఇటు తండ్రో ఎవరో ఒకరి రక్షణలోనే బ్రతుకు వెళ్ళదీయాల్సి వస్తోంది. కొందరికైతే తల్లి దండ్రు లిద్దరికి దూరమౌతున్నారు. ఆశ్రమాల్లో పెరు గుతున్నారు. ఇది చిన్ననాటి నుంచి వారిలో సమాజం పట్ల బాధ్యత కొరవడ్డానికి కారణమౌతోంది. విద్యా విషయంలోనూ తప్పటడు గులేస్తున్నా రు. సరైన దృక్పథం, మార్గదర్శకత్వ లోపాలు వారిని వెంటాడు తున్నాయని డేవిడ్ పేర్కొన్నారు. ఏ దేశానికెళ్ళినా భారతీయులు తమ ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్ర దాయ విలువల్ని కొనసా గించడంతో పాటు పిల్లలకు బోధించడం, వాటికనుగుణంగా వారిని పెంచుతున్న ందువల్లే భారతీయులు ఏ రంగంలోనైనా అగ్రగాములుగా రాణించగలుగుతున్నారని, ప్రతిభను పెంపొదించుకోగలుగుతున్నారని, పాశ్చాత్య సంస్కృ తికి ప్రభావితం కావడం లేదని ఆయన విశ్లేషిం చారు. ఇప్పుడు ఈ వీడియో భారత్‌లో విస్తృతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని శ్వేత జాతీయులు కూడా ఈ వీడియోను వీడిక్షిస్తున్నారు. తమ లోపాల్ని గుర్తిస్తున్నారు.