ఓ భారతీయ రెస్టారెంట్ లో టేబుల్ ని బుక్ చేసుకునేందుకు ఫోన్ చేసి కస్టమర్ తో స్వయంగా మాట్లాడారు బ్రిటన్ రాకుమారుడు.వారి పేరిట ఓ టేబుల్ ని బుక్ చేశారు. సెంట్రల్ ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌ను సతీసమేతంగా సందర్శించిన బ్రిటన్ రాకుమారుడు అక్కడి వారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలో రెస్టారెంట్ పూర్తి అడ్రస్‌ను యజమానిని అడిగి తెలుసుకుని మరీ కస్టమర్‌కు చెప్పారు. తానెవరో చెప్పకుండానే బ్రిటన్ రాకుమారుడు ఈ సంభాషణ అంతా కొనసాగించారు.టేబుల్ ఎవరి పేరు మీద బుక్ చేయమంటారు.. అయితే సరే.. రెండు పదిహేను కల్లా ఇక్కడికి వచ్చేయండి! అంటూ కస్టమర్‌తో ప్రిన్స్ విలియమ్ చెప్పారు. ఆ తరువాత రెస్టారెంట్‌లో వంటకాలు సిద్ధం చేయడంలో విలియమ్, కేట్ దంపతులు సాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి మరో చోటుకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ప్రిన్స్ విలియమ్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కస్టమర్‌కు సరైన అడ్రస్సే చెప్పామనుకుంటున్నాం అంటూ ఓ సరదా కామెంట్ కూడా చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement