రైలు ప్రయాణీకులకు ఇది గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం నుంచి ప్రయాణీకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రారంభించనుంది రైల్వే శాఖ. రిజర్వేషన్ లేకుండానే ఇకపై ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తోంది. కరోనా మహమ్మారికి ముందున్నట్టే జనరల్ కోచ్‌లలో రిజర్వేషన్ లేకుండా ప్రయామం చేయవచ్చు. కరోనా విజృంభన, లాక్ డౌన్ కారణంగా గతంలో జనరల్ కోచ్‌లలో ప్రయణాన్ని రైల్వేశాఖ నిలిపివేసింది. అయితే, ఇప్పుడు తిరిగి జనవరి 1 నుంచి ఆ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. దేశంలో కరోనా తగ్గుడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో పాత పద్ధతుల్ని తిరిగి అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కొత్త సంవత్సరం నుంచి ప్రయాణీకులు జనరల్ టికెట్‌పైనే ప్రయాణం చేయవచ్చు. అయితే తొలిదశలో కొన్ని ప్రత్యేక రైళ్లలో ఈ పాత సౌకర్యం కల్పించనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..