Friday, November 22, 2024

Indian Railways – చిన్న నిర్ల‌క్ష్యం – భారీ మూల్యం ..అడుగ‌డుగునా భ‌ద్ర‌తా లోపం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రపంచంలోనే అతి పెద్ద భూతల రవాణా సంస్థ ‘భారత రైల్వే’ను నిర్లక్ష్యం వెంటా డుతోంది. ఆ నిర్లక్ష్యం ఎక్కడ జరిగినా, అది ఎంత చిన్నదైనా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. రైల్వేలో ప్రతి విభాగానికి ఓ ప్రత్యేక వ్యవస్థ ఉన్నప్పటికీ, అడుగడుగునా భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రతినిత్యం లక్షలాది మందికి రైలు ప్రయాణం ప్రాణ సంకటంగా మారు తోంది. నిపుణుల కమిటీలు హెచ్చరించినా పట్టించుకోని ఉన్న తాధికార యంత్రాంగం వైనం.. భారీ ప్రమాదాలకు, ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు అనేకంగా జరిగిన రైలు ప్రమాదాలపై, అందుకు గల కార ణాలపై నిపుణుల కమిటీలు ఎన్నిసార్లు హెచ్చరించినా, నివేది కలు సమర్పించినా.. అవేవీ కార్యాచరణకు నోచుకోవడం లేదు. అనధికారిక సమాచారం మేరకు ఇప్పటివరకు 1100 లకు పైగా విచారణ నివేదికలు భారత రైల్వే బోర్డులో పెం డింగ్‌లో ఉన్నాయి.

అలాగే విశేష అనుభవం, నైనుణ్యత కలిగిన రైల్వే ఇంజనీరింగ్‌ విభాగం 171 ప్రమాద ఘటనలను విశదీకరించినప్పటికీ, ఏ ఒక్కదానిపైనా కేంద్ర ప్రభుత్వం చర్యలకు పూనుకోకపోవడం ఆశ్యర్యాన్ని, ప్రయాణికుల్లో ఒకిం త అసహనాన్ని కలిగిస్తోంది. స్వయం ప్రతిపత్తిగల సంస్థ ‘కాగ్‌’ హెచ్చరించినా రైల్వే బోర్డులో స్పందన కరు రైంది. ప్రమాదాలు జరిగినప్పుడే కంటితుడుపు చర్యలు తీసు కుంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని చెప్పడానికి అనేక సంఘటనలు, ప్రమాదాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రమాదాలపైనా, ‘రైల్వే’ నిర్లక్ష్యంపైనా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ప్రయాణీకుల భద్రత గాలికి?
లైఫ్‌ లైన్‌ ఆఫ్‌ ది నేషన్‌.. ఇది మన రైల్వే నినాదం.. జాతి జీవనరేఖ అన్న రైల్వే మాట ఎంతవరకు నిజమో కాదో.. కాని మృత్యుగీతికగా మారుతోందని ఒడిశా రైలు ప్రమాదంతో తేలిపోయింది. సిగ్నల్‌ జంపింగ్‌తో ప్రమాదానికి గురై వంద ల మంది ప్రాణాలు కోల్పోడానికి కారణమైన కోరమండల్‌ -టైన్‌ యాక్సిడెంట్‌ తర్వాత రైల్వే వైఫల్యం ఒక్కొక్కటిగా వెలు గుచూస్తోంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ లో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంగా మారిందా? మన రైల్వే ప్రమాదాలకు కారణమేంటి? అనే ప్రశ్నలకు సమా ధానం కనిపించడం లేదు.

బాలాసోర్‌ రైలు ప్రమాదం తర్వాత.. మన రైల్వే లో పాలపై సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేల్లో భద్రతా వైఫల్యం ఎక్కువగా ఉందని గత ఏడాదే కాగ్‌ హెచ్చ రించినా.. ఆ లోపాలను చక్కదిద్దే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు ప్రమాదం జరిగిన బాలాసోర్‌ మార్గం ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉంటు-ంది. రోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ఆ రూట్లో ప్రయాణిస్తుంటారు. తూర్పు-దక్షిణ భారత్‌లను కలిపే ఈ రూట్లో కూడా ఎన్నో లోపాలు వెలుగుచూ స్తున్నా యి. మానవ తప్పిదాలు కన్నా.. శాఖాపరమైన నిర్లక్ష్యం.. సాంకేతిక లోపాలతో తరచూ ప్రమాదాలు జరుగుతు న్నా యని గత నివేదికల ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

ప్రమాదాలపై 1,129 విచారణ నివేదికలు
ప్రమాదం జరిగినప్పుడల్లా ఓ విచారణ కమిటీని నియ మించడం, నివేదిక వచ్చిన తర్వాత వాటిని అటకెక్కించడం కేంద్ర ప్రభుత్వంలో, భారత రైల్వే బోర్డులో పరిపాటిగా మారుతోంది. 16 రైల్వే జోన్లలో రైలు పట్టాలు తప్పిన ప్రమా దాలపై 11 వందల 29 విచారణ నివేదికలు పరిశీలిస్తే… ప్రమా దాలకు 24 కారణాలు గుర్తించింది రైల్వే. లోకో పైలట్‌ కార ణంగా జరిగిన ప్రమాదాలకన్నా ఆపరేటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వైఫల్యం వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువగా చెబుతున్నారు. సిగ్నల్‌ పాయింట్‌లను తప్పుగా సెట్‌ చేయడం, షంటింగ్‌ ఆప రేషన్‌లలో తప్పుల వల్లే 80 శాతం ప్రమాదాలు జరుగు తున్నాయని కాగ్‌ నివేదిక బయటపెట్టింది.

అభద్రతపై దుమారం రేపిన ‘కాగ్‌’ నివేదిక
రైల్వేలో ఇంజనీరింగ్‌ వైఫల్యం వల్ల ఇండియన్‌ రైల్వే పట్టాలు తప్పుతోందని కాగ్‌ వ్యాఖ్యానించింది. నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. గుర్తించిన లోపాలను సవరించేలా సకాలంలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పింది కాగ్‌. అంతేకాదు పర్యవేక్షణ లోపం ఎక్కువగా ఉన్నందున సత్వరం ఇంజనీరింగ్‌ విభాగాన్ని పటిష్టం చేయాలని సూచించింది. ఇటీవల జరిగిన ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్‌ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగ్‌ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రధానికి లేఖరాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement