ఈ సంవత్సరం మార్చి 27వ తారీఖు నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ప్రారంభం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తోందట బీసీసీఐ. అయితే మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, డీవై పాటిల్ స్టేడియం, ఎంసీఏ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాగా నేడు ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ వర్చుల్ భేటీ నిర్వహించింది. ఒకవేళ కోవిడ్ వల్ల ఇండియాలో టోర్నీ చేపట్టలేని పక్షంలో , యూఏఈకి వేదికలను మార్చే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ అభిప్రాయపడింది. ముంబై, పూణెల్లో మ్యాచ్‌లను నిర్వహించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణం అవసరం ఉండదని, బయోబబుల్ సమస్య రాదన్న ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కోసం ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో యధావిధిగా కొనసాగించనున్నారు.
Indian premier league 2020 : ఇండియాలోనే ఐపీఎల్ టోర్నమెంట్స్ – కసరత్తు చేస్తోన్న ‘బీసీసీఐ’
Advertisement
తాజా వార్తలు
Advertisement