తుపాకులు గర్జించనీ… క్షిపణులు దూసుకురానీ.. మార్గంలో మందుపాతరలు మాటువేయనీ… వెరపు లేదు..
మరపులేదు.. లక్ష్యం ఒక్కటే.. వాటికి చిక్కకుండా.. తొక్కకుండా యుద్ధపీడిత ప్రాంతాలనుంచి ప్రతి భారతీయుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడమే.. ఒక్క ప్రాణమూ పోకుండా చూడటమే…
ఆఖరి వ్యక్తి వచ్చే వరకూ అలుపెరగని ప్రయత్నమే… అందుకు అవసరమైన అన్ని ఎత్తులు..జిత్తులు ఉపయోగించడమే. ఉక్రెయిన్‌లో చిక్కుపోయిన మనవాళ్లని క్షేమంగా తీసుకువచ్చేందుకు ఉపయోగించిన దౌత్యంవల్ల రష్యా తన దాడులను కొన్ని రోజులపాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ సారధ్యంలో అలా ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ఆపరేషన్ సుఖాంతమే.. ఈ తరలింపు ప్రక్రియలో అటు వైమానిక దళం… ఇటు నౌకాదళం అసమాన ధైర్యసాహసాలతో కర్తవ్యాన్ని పూర్తిచేయడం విశేషం.
ఆపరేషన్ గంగ
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలిం చేందుకు చేపట్టిన కార్యక్రమం ఇది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాల్లో ఎక్కువమంది చిక్కుకుపోయారు. వారిలో ఎక్కువమంది వైద్యవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులు. చివరి భారతీయుడిని తీసుకువచ్చేవరకు విశ్రమించబోం అని ప్రకటించిన విదేశాంగమంత్రి జైశంకర్ మాట నిలబెట్టుకు న్నారు. ప్రత్యేక విమానాల ద్వారా వెయ్యిమందిని స్వదేశానికి తరలించారు. ఇందుకోం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి-17 విమానం సేవలందించింది. ఉక్రెయిన్‌లోని రాయబార కా ర్యాలయ సిబ్బంది మనవాళ్లని క్షేమంగా రైల్వేస్టేషన్లకు.. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టులకు తరలించడానికి ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలండ్ సేవ లనూ భారత్ అర్థించింది. మరోవైపు రష్యాతో దౌత్యం నెరపిం ది. తరలింపు ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా రష్యా దా డులు నిలిపివేసేలా పుతిన్‌ను ఒప్పించగలిగారు. అతివేగంగా తరలింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు 24 గంటలూ పనిచేసే కంట్రోల్ కేంద్రాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలండ్ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడమే గాక, ప్రత్యేక, ప్రత్యామ్నాయ రాదారి మార్గాలను చూపిస్తూ మార్గ నిర్దేశనం చేసింది.
ఉఝూరోడ్ నుంచి బుడాపెస్ట్ కు ప్రత్యేక రైలు మార్గాన్ని వాడుకునేలా చూసింది. ఇదంతా భారత ప్రభుత్వం నెరపిన దౌత్యం ఫలితం. భారత్ తరలించివారిలో టర్కీ, పాకిస్తాన్‌కు చెందినవారూ ఉన్నారు. అప్పటి కీలక నేతలు, మంత్రులు హర్దీప్ పురి, కిరణ్ రిజుజు, జ్యోతిరాదిత్య సింధియా, సివిల్ ఏవియేషన్ మంత్రి జనరల్ వీకే ింగ్ పోలండ్, రొమేనియా లకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.
ఆపరేషన్ దేవ్‌శక్తి
2021లో అఎn్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెల కొన్నాయి. అమెరికా దళాలు వైదొలగడం, తాలిబన్లు విరు చుకుపడటం, అప్పటి ప్రభు త్వాధినేత పరారీ కావడం వంటి పరిణామాలు భయ పెట్టాయి. ఆ సమయంలో అఎn్గాన్‌లో చిక్కుకుపోయిన భారతీయలను తరలించేం దుకు చేపట్టిన కార్యక్రమం ఆప రేషన్ దేవ్‌శక్తి. ఈ కార్యక్రమంలో భాగంగా యుద్ధపీడిత రాజ ధాని కాబూల్ నుంచి ఢిల్లిdకి 40మందితోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న హిందువులు, సిక్కు లను ప్రాణాలతో కాపాడారు. తాలిబన్ గుప్పిట్లో కాబూల్ ఎయిర్‌పోర్టు ఉన్నప్పుడే.. ఈ తరలింపు ప్రక్రియ సాగడం వెనుక భారత దౌత్య చాతుర్యం పనిచేసింది. ఇందుకోసం అమెరికాసహా పలు దేశాల సహా యాన్ని కూడా తీసుకుంది. ఇందుకోం కాందహార్‌లో తాత్కా లిక కాన్సులేట్‌ను ఏర్పాటు చేసింది. అఎn్గాన్‌లోని దక్షిణ భాగప్రాంతాలనుంచి ఈ తరలింపు ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చిం ది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఎవరికీ ఏమీ కాకుండా చూసేం దుకు భారత్ నుంచి భారత దౌత్యవేత్తలు, భద్రతాసిబ్బంది అక్కడికి వెళ్లడం విశేషం.
ఆపరేషన్ రాహత్
2015లో యుద్ధపీడిత యెమన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి నుంచి 5వేలమంది భారతీయులను సురక్షితంగా తరలించాల్సి వచ్చింది. సముద్రమార్గం గుండా వారిని తరలించాలని నిర్ణయించిన భారత్ నౌకా, వైమానిక దళానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలను రంగంలోకి దింపింది. అడెన్ పోర్టుకు ఐదు కి.మి దూ రంలో యుద్ధ నౌకలు మోహరించగా తీరం నుంచి చిన్నచిన్న ఫెర్రీ బోట్లలో భారతీయులను చేర్చా రు. మొత్తంమీద 5600 మం ది భార తీయులను దేశానికి తీసుకువచ్చారు. వీరిలో 2900 సానా నుంచి ప్ర త్యేక విమానాల్లో తీసు కువచ్చారు. మిగతా వాళ్లు యుద్ధనౌకల్లో చేరుకున్నారు.
ఆపరేషన్ మైత్రి
నేపాల్‌లో తీవ్ర భూకం పం ఏర్పడినప్పుడు కేవలం పది హేను నిమిషాల వ్యవధిలో భారత్ చేపట్టిన సహాయక, తరలింపు కార్యక్రమం ఇది. 2015లో భయంకర భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. 5వేల మంది భారతీయులతోపాటు, అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ సహా పలుదేశాలకు చెందిన 170మందిని క్షేమంగా తీసుకువచ్చారు. గూర్ఖారెజిమెంట్‌కు చెందిన మాజీ సైనికులు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచు కున్నారు. తరలింపు ప్రక్రియలో ఐఐ 76, సి-130జె హెర్క్యు లెస్, సి-17 గ్లోబ్‌మాస్టర్, ఎంఐ -17 చాపర్‌లు, అధునాతన లైట్ హెలికాప్టర్లను ఉపయోగించారు.
ఆపరేషన్ కావేరి
సూడాన్‌లో సూడానీస్ ఆర్మీకి, పారామిలటరీ వర్గా లకు మధ్య ఎనిమిది రోజులుగా ఆధిపత్య పోరాటం సాగు తోంది. ప్రధానంగా రాజధాని ఖర్టౌమ్‌లో పరిస్థితి దార ణంగా మారింది. ఫలితంగా దేశం అల్లకల్లోలంగా మారిం ది. అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. హింస హద్దులు దాటింది. మారణహోమం సాగుతోంది. వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడినుంచి వివిధ దేశాలు తమవారిని స్వదేశాలకు తరలిస్తున్నాయి. అక్కడ సుమారు 4వేలమంది భారతీయులు సూడాన్‌లో ఉన్నారు. ఆహారం, నీళ్లు, మందులు కూడా అందని, బయ టకు వెళ్లలేని స్థితిలో చిక్కుకుపోయారు. సాయం చేసే వారూ లేరు. ఎక్కడా విద్యుత్ లేదు. వారిని క్షేమంగా దేశా నికి తీసుకురావడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడానికి మిత్రదేశాలతో కలసి భారత్ పనిచేస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా ప్రభు త్వంతో మన విదేశాంగమంత్రి జైశంకర్ మంతనాలు జర పడం ఫలితాన్నిచ్చింది. 66 మంది విదేశీయులు సహా 91 మంది విదేశీయులను సౌదీ సురక్షితంగా తరలించింది. వీ రిలో ముగ్గురు భారతీయులు. మరోవైపు జెడ్డాలో విమానా లను సిద్ధంగా ఉంచింది. సూడాన్‌కు ఒక నౌక చేరుకుంది.