Friday, November 22, 2024

Spl Story: కుక్క మొరిగిందన్న కోపం.. మహిళను చంపి బీచ్​లో పాతిపెట్టేశాడు!

తనను చూసి కుక్క మొరిగిందన్న కోపంతో ఓ వ్యక్తి మహిళను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు బృందం చేసిన పరిశోధనలో ఎన్నో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు భారత్​ వచ్చిన ఆస్ట్రేలియా పరిశోధన బృందం నాలుగేండ్ల మారు వేశంలో తిరుగుతున్న నిందితుడిని పట్టుకోగలిగింది. కోర్టులో ప్రొడ్యూస్​ చేసి నిందితుడి అసలు రూపం బయటపెట్టింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

భారత సంతతికి చెందిన రాజ్‌విందర్ సింగ్ ఆస్ట్రేలియాలో ఓ మహిళని చంపేశాడు. హత్య కేసు దర్యాప్తులో నిందితుడు బాధితురాలి కుక్క మొరిగిందనే కారణంతో ఆమెను చంపినట్టు వెల్లడించాడు. మరణించిన మహిళ 24 ఏళ్ల టోయా కార్డింగ్లీగా గుర్తించారు. క్వీన్స్ లాండ్‌లోని కెయిర్న్స్ కు ఉత్తరాన ఉన్న వాంగెట్టి బీచ్‌లో తన కుక్కతో ఆమె నడుస్తుండగా.. రాజ్​విందర్​ సింగ్​ని చూసి ఆ పెట్​ డాగ్​ మొరిగింది. దీంతో కోపం పెంచుకున్న అతను ఆమెను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఆ తర్వాత కుక్కనే అక్కడే కట్టేసి వెళ్లిపోయాడు. 

వృత్తిరీత్యా మేల్​ నర్సుగా పనిచేస్తున్న రాజ్‌విందర్ సింగ్ బీచ్‌కి వెళ్లేవాడు. ఆ క్రమంలో అతడిని చూసి టోయాకి చేందిన పెట్​ డాగ్​ మొరిగింది. దీంతో కోపం పెంచుకున్న అతను.. కత్తితోపాటు కొన్ని పండ్లు తీసుకుని బీచ్​కి వెళ్లాడు. అంతేకాకుండా తన భార్యతో జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కార్డింగ్లీ యొక్క కుక్క సింగ్​ని చైసి మళ్లీ మొరిగింది. అది అతనికి కోపం తెప్పించింది. ఈ విషయమే వారి మధ్య గొడవకు దారితీసిందని పరిశోధకులు తెలిపారు.

ఆమె కుక్క తనను చూసి మొరిగిందని విసిగిపోయిన రాజ్​విందర్​ సింగ్ తెలిపాడు. దీంతో కుక్క యజమాని అయిన టోయాని అనేకసార్లు కత్తితో పొడిచి, మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్టు తెలిపాడు. ఆ తర్వాత ఇన్నిస్‌ఫైల్ పట్టణంలో తన ఇంటికి తిరిగి రావడానికి ముందు కుక్కను చెట్టుకు కట్టివేసినట్లు పరిశోధకులను ఉటంకిస్తూ ఓ వార్త సంస్థ కథనం ప్రచురించింది.

- Advertisement -

కాగా, భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ పౌరుడైన సింగ్, 2018లో దేశం విడిచి పారిపోయాడు. ఇక ఈ కేసులో అతనిపై 8.16కోట్ల రూపాయల రివార్డును అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం అతడిని ఉత్తర ఢిల్లీలోని జీటీ కర్నాల్ రోడ్ లో అరెస్టు చేసి అప్పగించే ప్రక్రియ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు.

నిందితుడు రాజ్​విందర్​సింగ్​, మృతురాలు టోయా కార్డింగ్లీ

అతను తన భార్య లేదా పిల్లలతో టచ్‌లో లేడని, తల్లిదండ్రులు పంజాబ్‌లో నివసిస్తున్నారని దర్యాప్తు బృందం తెలిపింది. అయినా.. అతను తల్లిదండ్రులతో కూడా టచ్‌లో లేడని తమ పరిశీలనలో తేలిందని అధికారులు వెల్లడించారు. పంజాబ్‌, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ.. నిత్యం వేషధారణ మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. తమ బృందం అతన్ని అరెస్టు చేసినప్పుడు అతను ఉత్తర ఢిల్లీలో జర్నీలో ఉన్నాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు రూపు మార్చుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

అప్పటికి దేశం విడిచి పారిపోయిన అతడిని పట్టుకునేందుకు క్వీన్స్ లాండ్ పోలీసులు వేట ప్రారంభించారు. సింగ్ (38)పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత నేరస్థుల అప్పగింత చట్టం కింద నవంబర్ 21న పాటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏజెన్సీల నుంచి కొన్ని ఇన్‌పుట్‌లు అందడంతో ఢిల్లీ పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడు భారతదేశానికి వచ్చి పంజాబ్‌లో నివసించడం ప్రారంభించాడు. దర్యాప్తు అధికారులు అతని గ్రామంలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రారంభించిన తర్వాత సింగ్ చివరకు పోలీసుల వలలో చిక్కుకున్నాడు. అతను తలపాగా ధరించి, గడ్డంతో తప్పించుకోవాలని ప్లాన్​ చేసినట్టు గుర్తించమాని పరిశోధన బృందం తెలిపింది.

నిందితుడు భారత్‌కు వచ్చి పంజాబ్‌లో ఉంటున్నట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ప్రభుత్వాన్ని సంప్రదించారు. క్వీన్స్ లాండ్ పోలీసు అధికారులు కూడా భారతదేశానికి వచ్చారు. తాము అతనిని కనుగొనడానికి సింగ్ గ్రామంలో ఇంటింటికీ వెరిఫికేషన్​ ప్రక్రియను ప్రారంభించామని వారు తెలిపారు. 

అతని అరెస్టు తర్వాత క్వీన్స్ లాండ్ పోలీసు కమిషనర్ కటారినా కారోల్ మీడియాతో  మాట్లాడారు. అక్టోబరు 2018లో కైర్న్స్ కు ఉత్తరంలోని వంగెట్టి బీచ్‌లో ఆమె మృతదేహం కనుగొన్నామని తెలిపారు. ఆమెను చంపిన వ్యక్తం ఇండియాకి పారిపోయి పంజాబ్‌లో ఉంటున్నట్టు తమకు ఆధారాలు అందాయి. అక్టోబర్ 23, 2018న నిందితుడు సింగ్​ భారతదేశం వెళ్లినప్పటి నుండి నాలుగేళ్లు అయినా వారి కుటుంబాన్ని కలుసుకోలేదు. వారి ఇంటి తలుపులు మూసివేయడంతో తాము దీనిపై మరింత పరిశోధన చేయాల్సి వచ్చింది. అతడిని ఎట్టకేలకు పట్టుకోవడంతో తాము చాలా సంతోషంగా ఉన్నాం అని సీపీ కటారినా కరోల్​ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement