Tuesday, November 26, 2024

వాతావ‌ర‌ణ శాఖ‌, యూపీ సీఎంవో ట్విట్ట‌ర్ అకౌంట్స్ హ్యాక్‌..

భారత వాతావరణ శాఖ, ఉత్తరప్రదేశ్‌ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్‌ ఖాతాలు ఇవ్వాల హ్యాక్‌ అయ్యాయి. వాతావరణ శాఖ ట్విట్టర్‌లో హ్యాకర్లు ఒక ప్రొమోషన్‌కు సంబంధించిన అంశాన్ని ట్వీట్‌ చేశారు. ‘బీన్జ్ అధికారిక కలెక్షన్ వేడుకలో భాగంగా రాబోయే 2 గంటల పాటు కమ్యూనిటీలోని యాక్టివ్ ఎన్‌ఎఫ్టీ వ్యాపారులందరికీ ఎయిర్‌డ్రాప్‌ను ప్రారంభించాం’ అని అందులో పేర్కొన్నారు. వాతావరణ శాఖ ప్రొఫైల్‌ చిత్రాన్ని కూడా హ్యాకర్లు తొలగించారు. అలాగే ఇతర ప్రైవేట్‌ ట్విట్టర్‌ ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ పలు ట్వీట్లు కూడా చేశారు.

https://twitter.com/Indiametdept/status/1512798299946098695

శనివారం సాయంత్రం జరిగిన ఈ హ్యాక్‌ను కొందరు గుర్తించారు. హ్యాక్‌ ఘటనలు జరుగడం ఇది రెండోది. దీనికి ముందు శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్‌ అయ్యింది. దీంతో అధికారులు స్పందించారు. నాలుగు గంటల తర్వాత దానిని పునరుద్ధరించారు. యూపీ సీఎం కార్యాలయం అధికార ట్విట్టర్‌ ఖాతాలో హ్యాకర్లు పోస్ట్‌ చేసిన ట్వీట్లను తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement