ఒలింపిక్స్‌లో భారత వేట మొదలైంది. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 3-2 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి క్వార్టర్ చివరి వరకు 1-0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్స్‌ను బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు తొలి క్వార్టర్ చివరన గోల్ ని సాధించి స్కోర్‌ను 1-1తో సమం చేసారు. ఇక రెండవ క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మూడవ క్వార్టర్ లో భారత్ మరొక గోల్ తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ కొట్టగా, రూపిందర్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ కొట్టి ఆకట్టుకున్నారు. భారత జట్టు తమ రెండో మ్యాచ్‌లో జూలై 25న పటిష్టమైన ఆస్ట్రేలియాతో ఆడనుంది.
ఇది కూడా చదవండిః 40 మంది సలహాదారులు అవసరమా?: ఏపీ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్న