Friday, November 22, 2024

Spl Story | విపక్షాలు, మీడియాపై నిఘా?.. క్వాడ్రీమ్​ స్పైవేర్​ పర్చేజ్​ కోసం యత్నాలు!

రాబోయే జనరల్​ ఎలక్షన్స్​ని గెలవడానికి బీజేపీ పక్కాగా ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకని ఇప్పటి నుంచే గ్రౌండ్​ వర్క్​ ప్రిపేర్​ చేసుకుంటోంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నిఘా పెడుతోందా? జర్నలిస్టులను టార్గెట్​ చేసుకుని స్పై చేస్తోందా? సామాజిక కార్యకర్తల మాటలను చాటుమాటుగా వినడానికి యత్నిస్తోందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీనికి ఓ మీడియా సంస్థ వెలువరించిన నివేదిక ప్రతి భారతీయుడిని నివ్వెర పోయేలా చేస్తుంది. ఇంతకుముందు ఇజ్రాయెల్​ ఎన్​ఎస్​వో కంపెనీ పెగాసెస్​ మాదిరిగానే ప్రధాని మోదీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఓ స్పైవేర్​ని పర్చేజ్​ చేయడానికి సీరియస్​గా ట్రై చేస్తోందని, దాని కోసం 12మిలియన్ల డాలర్లను ఖర్చు చేయడానికి అయినా రెడీగా ఉన్నట్టు ఆ వార్త కథనం ద్వారా స్పష్టమవుతోంది.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పెగాసస్ స్పైవేర్ మరోసారి చర్చల్లో నిలుస్తోంది. ఎంతోమంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు చెందిన ఈ సాఫ్ట్ వేర్‌ను ఉపయోగించారనే ఆరోపణలున్నాయి. 50వేల నెంబర్ల డేటా బేస్ లీక్​ కావడంపై ద గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్, ద వైర్, ఫ్రంట్‌లైన్, రేడియో ఫ్రాన్స్ లాంటి 16 మీడియా సంస్థల జర్నలిస్టులు పరిశోధనలు చేశారు.

సాఫ్ట్ వేర్‌ను వివిధ దేశాల ప్రభుత్వాలకే అమ్ముతామని, నేరస్థులు, తీవ్రవాదులను ట్రాక్ చేసే ఉద్దేశంతో ఆ సాఫ్ట్ వేర్‌ను తయారు చేశామని ఇజ్రాయెల్​ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇంతకుముందే స్పష్టంగా చెప్పింది.  అయితే.. పారిస్‌లోని ఫర్‌బిడెన్ స్టోరీస్ మీడియా సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు 50వేల ఫోన్ నెంబర్లకు సంబంధించిన డేటా లభించింది. ఈ రెండు సంస్థలు ప్రపంచంలోని 16 మీడియా సంస్థలతో కలిసి ఈ డేటా బేస్ నెంబర్లపై పరిశోధనలు చేయడానికి ఒక రిపోర్టర్ల గ్రూప్ ఏర్పాటుచేశాయి.

ఈ 10 దేశాల్లో యూఏఈ, సౌదీ, భారత్..

- Advertisement -

పెగాసస్ ప్రాజెక్టులో ఆ 1571 నెంబర్లు ఎవరివని తెలుసుకోడానికి పరిశోధన చేసినట్టు తెలుస్తోంది. అందులో 10 దేశాల ఎన్ఎస్ఓ వినియోగదారులు ఆ సిస్టమ్‌లో ఈ నెంబర్లు ఎక్కించినట్లు తేలింది. ఆ దేశాల్లో భారత్, అజర్‌బైజాన్, బహ్రెయిన్, కజకిస్తాన్, మెక్సికో, మొరాకో, రువాండా, సౌదీ అరేబియా, హంగరీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలున్నాయి.  మొత్తం 50 వేల నెంబర్ల డేటా బేస్‌ 45 దేశాలకు సంబంధించినది అయ్యుండవచ్చని దీనిపై పరిశోధనలు చేసిన జర్నలిస్టుల బృందం భావిస్తోంది. పెగాసస్ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకూ రెండు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. వాటి ద్వారా లీకయిన డేటాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్నికల కమిషన్ మాజీ సభ్యుడు అశోక్ లావాసా, వైరాలజిస్ట్ గగనదీప్ కాంగ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సహా కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నేతలు, సిక్కు కార్యకర్తల నంబర్లు కూడా ఉన్నారు.

ఇక.. వీరితోపాటూ భారత జర్నలిస్టుల నెంబర్లు కూడా లీకయిన ఎన్ఎస్ఓ జాబితాలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. వారిలో ఇద్దరు ద వైర్‌ వ్యవస్థాపకులు, ద వైర్ కంట్రిబ్యూటర్ రోహిణీ సింగ్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్ట్ సుశాంత్ సింగ్ పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. కాగా.. ఈ నిఘా యొక్క అపకీర్తి గురించి బహిర్గతం అయిన తర్వాత భారతదేశం మరో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నట్టు కొన్ని ఇంటర్నల్​ సోర్స్​ని బట్టి స్పష్టమవుతోంది.

పెగాసెస్​కు బదులు ప్రత్యామ్నాయ స్పైవేర్​..

ఓ మీడియా సంస్థ రాసిన కథనం ప్రకారం.. భారత్​లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం NSOకి చెందిన పోటీదారులకు తక్కువగా బహిర్గతమయ్యే ప్రత్యామ్నాయ స్పైవేర్ కోసం వెతుకుతున్నట్లు రక్షణ, గూఢచార శాఖ వర్గాల ద్వారా బయటికి వచ్చింది. ఇది రాబోయే కొన్ని సంవత్సరాల్లో 12 మిలియన్​ డాలర్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇక.. పెగాసస్ స్పై వేర్​ని 2010లో అభివృద్ధి చేశారు. ఇది ప్రభుత్వ ఏజెన్సీలు ఉపయోగించే హానికరమైన సాఫ్ట్ వేర్. ఇది వారికి తెలియకుండానే తమ టార్గెట్​కి చెందిన పరికరాన్ని (ప్రధానంగా మొబైల్ ఫోన్‌ల ద్వారా)యాక్సెస్ చేయడానికి రూపొందించారు.

కాగా, నవంబర్ 2021లో అమెరికాకు చెందిన వైట్ హౌస్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పెగాసస్ యునైటెడ్ స్టేట్స్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష లీడర్లు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులను టార్గెట్​ చేసుకుని ప్రయోగించారని, అందుకని దీన్ని తాము బ్లాక్ లిస్ట్ చేసినట్టు తెలిపింది. ఇక.. ఇప్పుడు గ్రీస్ ప్రధాన కార్యాలయమైన ఇంటెలెక్సా అభివృద్ధి చేసిన స్పైవేర్ ‘ప్రిడేటర్’ను భారత్ పరిశీలిస్తోందని మరో నివేదిక ద్వారా వెల్లడవుతోంది.

క్వాడ్రీమ్ స్పైవేర్​ని పరిశీలిస్తున్న భారత్​..

సిటిజన్ ల్యాబ్.. ఫేస్‌బుక్ తెలిపిన వివరాల ప్రకారం..ఈజిప్ట్, సౌదీ అరేబియా, మడగాస్కర్, ఒమన్‌తో సహా మానవ హక్కుల ఉల్లంఘన రికార్డు ఉన్న దేశాలలో ప్రిడేటర్ ఇప్పటికే పనిచేస్తున్నట్టు ఆ నివేదికలో పొందుపరిచారు. స్పైవేర్ ప్రిడేటర్‌తో పాటు.. భారతదేశం క్వాడ్రీమ్, కాగ్నైట్‌లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా, వాషింగ్టన్ పోస్ట్ పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత క్వాడ్రీమ్‌ను సౌదీ ప్రభుత్వానికి విక్రయించినట్లు ఇద్దరు ఇజ్రాయెల్ అధికారులు మీడియా ప్రతినిధులకు చెప్పారు.  

ఆందోళన వ్యక్తంచేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్..

పెగాసస్‌కు ఇతర ప్రత్యామ్నాయాల కోసం భారత ప్రభుత్వం శోధిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లోని సెక్యూరిటీ ల్యాబ్ ఈ చర్యను “మానవ హక్కులకు అగౌరవం”గా అభివర్ణించింది. స్పైవేర్ టెక్నాలజీని తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం.. భిన్నాభిప్రాయాలను అణిచివేయడం, సభ, భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేందుకు ఉపయోగించడం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఈ పద్ధతులను అక్రమంగా అసమ్మతివాదులను.. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు అనిఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లోని సెక్యూరిటీ ల్యాబ్ అధిపతి డోన్చా Ó సియర్‌బైల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement