ప్రపంచాన్ని కాలుష్యం మసిచేసేస్తోంది…రోడ్డు మీదకు వెళ్లగానే వాహనాల నుంచి వచ్చే పొగ, శబ్దం ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తాయి. ఇంతాలా టెక్నాలజీ వస్తున్న కానీ రోడ్లపై పరిస్థితి అలాగే ఉంటోంది. దీనికి తోడు పెరుగుతున్న పెట్రోల్ , డీజిల్ ధరలు సామాన్యుడిని కుదేలు చేస్తున్నాయి. మరీ వీటి నుంచి బయటపడేదెలా? ఓ పరిష్కారాన్ని కనిపెట్టాయి ప్రపంచ దేశాలు. అవును అదే విద్యుత్ వాహనాల వినియోగం. మన దేశంలోనూ ఇప్పటికే చాలా మందికి దానిపై అవగాహన వచ్చింది. కొన్ని కంపెనీలు విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నాయి. మార్కెట్ లోకి వచ్చాయి.
మన దేశ ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వాడకంపై చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. కాలుష్యాన్ని తగ్గించి, పెట్రోల్, డీజిల్పై ఆధారపడడం తగ్గిస్తూ, విద్యుత్ వాహనాల తయారీకి కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో వాటి తయారీ చాలా తక్కువగా ఉండడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. మరో నెలలో ఆ పథకానికి సంబంధించిన తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.