Saturday, November 23, 2024

హాలీవుడ్ న‌టుడిలా .. భార‌త విదేశాంగ‌మంత్రి జైశంక‌ర్

హాలీవుడ్ న‌టుడిలా మారిపోయారు భార‌త విదేశాంగ‌మంత్రి ఎస్.జైశంక‌ర్. స్వీడన్ రక్షణ మంత్రి పాల్ జాన్సన్ తో సమావేశం అనంతరం ఆయనతో కలిసి జై శంకర్ ఓ ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోలో ఆయన ఫిట్టింగ్ సూట్, టై ధరించి, సన్ గ్లాసెస్ పెట్టుకొని చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోను జై శంకర్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఇప్పడిది వైరల్ గా మారింది.
ఆయన లుక్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ లా ఉన్నారంటూ పొగడ్తలతో ముంచెతుత్తున్నారు. ‘టామ్ క్రూయిజ్, బ్రాడ్ పిట్ లకు పోటీగా కనిపిస్తున్నారు’ అని కామెంట్ చేస్తున్నారు. ‘ఇది నిజమైన 007 లుక్’ అంటూ ట్విట్టర్ యూజర్లు పేర్కొంటున్నారు. మరి కొందరు ‘మెన్ ఇన్ బ్లాక్’ అని కామెంట్ చేయగా.. మరో యూజర్ ‘కిల్లర్ లుక్’ అని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్ర‌మంత్రి లుక్ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement