Friday, November 22, 2024

మ‌త్య్స‌కారుల‌ను విడిచిపెట్టిన పాకిస్థాన్ – స్వాగ‌తం ప‌లికిన భార‌త సైన్యం

పాకిస్థాన్ జ‌లాల్లో అక్ర‌మంగా చేప‌ల‌వేట సాగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై గ‌త ఐదు సంవత్స‌రాలుగా క‌రాచీలోని లాంధీ ప్రాంతంలోని మాలిర్ జిల్లా జైలు శిక్ష అనుభ‌వించారు ప‌లువురు మ‌త్య్స‌కారులు. కాగా వారిని పాకిస్థాన్ విడుద‌ల చేసింది..వారంతా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. వారికి భార‌త సైన్యం స్వాగతం ప‌లికింది.
సింధ్ ప్రావిన్స్‌లోని మాలిర్‌లోని జిల్లా జైలు, కరెక్షనల్ ఫెసిలిటీ నుండి విడుదలైన 20 మంది భారతీయ మత్స్యకారులను ప్రత్యేక బస్సులో లాహోర్‌కు తీసుకువచ్చారు. సోమవారం వాఘా సరిహద్దు వద్దకు వచ్చినప్పుడు.. వారికి ఆహారం, కొత్త బట్టలు, PKR 5,000 అందిచారు. ఇమ్మిగ్రేషన్ తర్వాత.. వారిని సరిహద్దు భద్రతా దళం (BSF)కి అప్పగించారు.

వీరంద‌రూ గుజరాత్‌కు చెందిన వారే. పాక్‌ నేవీ సిబ్బంది తమను సముద్రంలో పట్టుకుని జైల్లో ఉంచారని భారత జాలర్లు ఆరోపించారు. తాము ఐదేళ్లు జైలులో మగ్గినట్లు చెప్పారు. తమ విడుదలకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు చెప్పారు. ఇది.. మానవ స్వభావంతో కూడుకున్న స‌మ‌స్య అని, భారత్‌ కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తుందని పాకిస్థాన్‌ భావిస్తోందని హైకమిషన్‌ పేర్కొంది. పాకిస్తాన్‌లో ఈ మత్స్యకారులపై న్యాయ విచారణ నిర్వహించబడింది. వారిలో కొంద‌రూ 4 నుంచి 5 సంవత్సరాల శిక్ష అనుభ‌వించారు. ఈ మత్స్యకారుల శిక్ష ముగిసిన తర్వాత పాకిస్తాన్ వారిని వెనక్కి పంపిందని, వారు అట్టారీ సరిహద్దు నుండి భార‌త్ కు వచ్చారని, వారి పూర్తిగా చెకప్ పూర్తయిన తర్వాత, గుజరాత్ పోలీసులు వారిని తీసుకువెళతారని ప్రోటోకాల్ ఆఫీసర్ అరుణ్ పాల్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement