Tuesday, November 19, 2024

అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందిన భార‌త రాయ‌బారి ‘ముకుల్ ఆర్య‌’

అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు పాల‌స్తీనాలో భార‌త రాయ‌బారి ముకుల్ ఆర్య‌. రామల్లాహ్‌లోని భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు. ముకుల్‌ ఆర్య చనిపోయిన విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ ధ్రువీకరించారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఆయన ఎలా చనిపోయారనే విషయంపై ఇంకా తెలియరాలేదు. రమల్లాలో భారత ప్రతినిధి ముకుల్‌ ఆర్య మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి జయశంకర్‌ అన్నారు. ముకుల్‌ ఎంతో తెలివైన, ప్రతిభావంతమైన అధికారిని చెప్పారు. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి జయ్‌శంకర్‌ ట్వీట్‌ చేశారు.ముకుల్‌ ఆర్య 2008 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ఆయన ఢిల్లీలోని జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీల్లో చదివారు. కాబుల్‌, మాస్కోల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కూడా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement