భారత ఎయిర్‌ఫోర్స్ అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం చేరింది. పర్వతాల వెనకాల దాగి ఉన్న శత్రు మూకలను సైతం టార్గెట్ చేసి ధ్వంసం చేయగల క్షిపణులను ఇజ్రాయెల్ నుంచి ఇండియా కొనుగోలు చేసింది. దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ కూడా ఈ క్షిపణుల ద్వారా ఈజీగా దెబ్బతీయొచ్చు. ఇప్పుడు ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ ట్రయల్స్‌ని జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్ కి చెందిన స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ (NLOS) యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను భారత్ కొనుగోలు చేసింది. వీటిని కొనుగోలు చేయడం ద్వారా పర్వతాల వెనుక ఉన్న రహస్య శత్రు శిబిరాలను కూఆ ధ్వంసం చేయడానికి భారత వైమానిక దళం (IAF) తన సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది. ఈ అధునాతన క్షిపణి 30 కి.మీల పరిధిలోని టార్గెట్‌ని ఈజీగా కూల్చివేస్తుంది. సుదూర లక్ష్యాలను కచ్చితంగా ఛేదించడానికి వీలు కల్పిస్తుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.
కాగా, ఇజ్రాయెలీ స్పైక్ క్షిపణుల డెలివరీ ఇప్పటికే పర్తయ్యిందని, IAF ఇప్పుడు వాటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ట్రయల్స్ నిర్వహించనున్నట్టు సమాచారం అందుతోంది. కాగా, భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఈ క్షిపణుల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఈ క్షిపణులను Mi-17తో సహా IAF కు చెందిన హెలికాప్టర్లలో, భారతదేశం తయారు చేసిన ‘ప్రచండ్’ హెలికాప్టర్లలో ఉపయోగించనున్నారు. భారత సైన్యం త్వరలో ఈ క్షిపణుల ట్రయల్‌ని నిర్వహించనున్నట్టు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.
స్పైక్ NLOS క్షిపణుల లక్షణాలు
పరిధి: 32-కి.మీ
బరువు: 70-కిలోలు
వేదిక: హెలికాప్టర్
అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి ఇట్లాంటి క్షిపణిని కొనుగోలు చేశాయి. ఈ క్షిపణులను ఇప్పటికే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా యుద్ధ ప్రాంతాల్లో ఉపయోగించినట్టు సమాచారం.