భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2.0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. అయితే.. ఈ రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన టీమిండియా, ఆ తర్వాత బౌలింగ్‌లో అంత ఇంపాక్ట్ చూపలేదు. దీంతో సౌతాఫ్రికా జట్టు కూడా గట్టిగానే పోరాడింది. అయితే.. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ టెంబా బవుమా (0), రైలీ రూసో (0) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ (33) ఆదుకున్నాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ క్వింటన్ డీ కాక్ 69 అతనికి మంచి సహకారం అందించాడు. కాగా ఫోర్త్ డౌన్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ 106 కూడా చెలరేగి ఆడాడు.
దీంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లలో 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా 16 పరుగుల తేడాతో మ్యాచ్ విన్ అయ్యింది. అయితే పవర్‌ప్లే ముగిసిన మరుసటి ఓవర్లోనే మార్క్రమ్‌ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ వేసిన బంతిని కవర్ డ్రైవ్ ఆడేందుకు మార్క్రమ్ ప్రయత్నించాడు. కానీ బంతిని మిస్సయ్యాడు. దాంతో అది వికెట్లను కూల్చింది. దీంతో మూడు వికెట్లు నష్టపోయిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో భారత టార్గెట్‌ను చేరుకోలేక ఓటమి చెందింది.