మూడో వన్డేలో స్వీప్ ఔట్ తో సిరీస్ ని కైవసం చేసుకుని భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ కూడా వెనుదిరిగాడు.అలా తక్కువ స్కోర్ తో కష్టల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 80 పరుగులు చేసాడు.. 9 ఫోర్లు కొట్టిన అయ్యర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషబ్ బంత్ 54 బంతుల్లో 56(ఆరు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. భారత్ నిలదొక్కుకుంటున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్ వాల్ష్ పంత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యాకుమార్ యాదవ్ ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ను వాల్ష్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ చాహర్ దాటిగా ఆడాడు. 38 బంతుల్లో 38(4 ఫోర్లు, 2 సిక్స్)పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు, జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. అలెన్, స్మిత్ చేరో వికెట్ పడగొట్టారు. 266 పరుగుల విజయ లక్ష్యంతో బరికి దిగిన వెస్టిండీస్ ఏ దశలోను విజయం సాధించేలా కనిపించ లేదు. క్రమం తప్పుకుండా వికెట్లు కోల్పోయింది. 169 పరుగులకు ఆలౌట్ అయింది. ఒడియన్ స్మిత్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ 34 పరుగులు చేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (కీపర్), బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, శర్మ బ్రూక్స్, జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, ఫాబియన్ అలెన్, హెడెన్ వాల్ష్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..