Tuesday, November 26, 2024

లెక్క సరి చేసిన టీమిండియా

ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో విజయ తీరాలకు చేరింది. ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన మోర్గాన్ సేన.. తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. రోహిత్ (12), రాహుల్ (14) మరోసారి విఫలమయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ హిట్టింగ్ చేశాడు. తన బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ ప్రియులను అలరించాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేసి వెనుతిరిగాడు. అతడికి పంత్ (30), శ్రేయాస్ అయ్యర్ (37) సహకరించారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 185/8 భారీ స్కోరు చేసింది. ఆర్చర్‌కు నాలుగు వికెట్లు దక్కగా రషీద్, స్టోక్స్, మార్క్ వుడ్, శ్యామ్ కరణ్ తలో వికెట్ సాధించారు.

అనంతరం 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు జాసన్ రాయ్ (40) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. తర్వాత అతడు ఔటైనా మలాన్ (14), బెయిర్ స్టో (25), బెన్ స్టోక్స్ (46) ఇంగ్లండ్‌ను గెలిచిపించేందుకు విఫలయత్నం చేశారు. ఓ దశలో మోర్గాన్ సేన గెలిచేలా కనిపించగా… రెండు వరుస బంతుల్లో స్టోక్స్, మోర్గాన్‌ను ఔట్ చేసి భారత్‌ను శార్దూల్ పోటీలోకి తెచ్చాడు. చివరకి ఇంగ్లండ్ 177/8 స్కోరు మాత్రమే చేసి 8 పరుగులతో ఓడిపోయింది. ఈ విజయంతో టీమిండియా 5 టీ20ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement