Friday, November 22, 2024

ఆ మ్యాచ్‌తో.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్ రికార్డు..!

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఫిబ్రవరి 6నుంచి పరిమిత ఓవర్ల సిరీస్‌ ప్రారంభం కానుంది. పర్యాటక విండీస్‌జట్టు భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. వైట్‌బాల్‌ సిరీస్‌లో అహ్మదాబాద్‌ వేదికగా ముందుగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. 6న భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగే తొలివన్డే భారత క్రికెట్‌ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అత్యధికంగా 1000వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్‌ అవతరించనుంది. వన్డేసిరీస్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుండగా టీ20సిరీస్‌ కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది.

కాగా భారతజట్టు తొలివన్డే మ్యాచ్‌ 1974లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఆడి 4వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటివరకు 999 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 518మ్యాచ్‌ల్లో విజయం సాధించి 431మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. 958మ్యాచ్‌ల్లో 581మ్యాచ్‌ల్లో విజయంసాధించిన ఆసీస్‌ తొలిస్థానంలో కొనసాగుతుంది. 900పైగా వన్డేమ్యాచ్‌లు ఆడిన దేశాల్లో భారత్‌ తరువాత ఆస్ట్రేలియా 958, పాకిస్థాన్‌ 936 మ్యాచ్‌లతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement