Tuesday, November 26, 2024

Assam: క్రికెట్​ అభిమానుల్లో ఫుల్​ జోష్​.. గౌహతి స్టేడియంలో రేపు సెకండ్​ టీ20

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్​ జరగనుంది. అస్సాంలోని గౌహతి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్​కోసం ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని తెలుస్తోంది. టిక్కెట్లు విక్రయంలో తాము పాటించిన ట్రాన్పరెన్సీతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగిందని, అందుకే త్వరగా అమ్ముడు పోయినట్టు వెల్లడించారు అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) కార్యదర్శి దేవజిత్ సైకియా.  తాము ఫుల్ హౌస్‌ని ఆశిస్తున్నామని, సుమారు 38,000 సీట్లలో 21,200 సాధారణ ప్రజల కోసం.. రెండు దశల్లో ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించినట్టు తెలిపారు.

ఇక.. ఈ టిక్కెట్లన్నీ అతి తక్కువ సమయంలో అమ్ముడుపోయినట్టు తెలిపారు సైకియా.  జిల్లా సంఘాల ద్వారా మరో 12,000 టిక్కెట్లను ప్రజల కోసం అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వాటిని కౌంటర్లలోనే విక్రయించినట్టు చెప్పారు. సాధారణంగ జిల్లాలకు పంపిన టిక్కెట్లలో 40-50% అమ్ముడుపోకుండానే తిరిగి వస్తుంటాయి. కానీ, ఈసారి 100 టిక్కెట్లు కూడా తమకు తిరిగి రాలేదు అని చెప్పారు.

మిగిలిన టిక్కెట్లు రాష్ట్ర సంఘాలకు పంపిస్తామని, కొంతమంది ప్రత్యేక అతిథులు.. ఆహ్వానితులకు కాంప్లిమెంటరీ పాస్‌లుగా ఇస్తామని వెల్లడించారు. గౌహతిలోని ACA స్టేడియం సామర్థ్యం 39,500  ఉన్నాయని, అయితే ఇందులో 1,500 సీట్లు ఎందుకు పనికిరావని వెల్లడించారు. ఎందుకంటే అక్కడ నుండి క్రికెట్​ చూడడం సాధ్యం కాదని, అందుకే వాటి కోసం టిక్కెట్లు అమ్మకం చేయలేదన్నారు.

కాగా, టికెట్ విక్రయం పూర్తిగా పారదర్శకంగా ఉండటం వల్ల గేమ్‌ను ఇష్టపడే వారు తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు తరలి వస్తారని, వారిలో అపూర్వమైన ఉత్సాహం ఉందని తెలిపారు సైకియా. 2020 జనవరిలో ఇదే వేదికపై జరిగిన చివరి మ్యాచ్ వాష్ అవుట్ అయినందున, ప్రజల్లో ఉత్సాహం మరింత ఎక్కువగా ఉందని చెప్పారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, ట్రాఫిక్ ఏర్పాట్లు అన్ని ఏజెన్సీలు సమన్వయంతో పని చేయడం ఫూల్‌ప్రూఫ్ అని ఆయన అన్నారు. మాచ్ రోజు దుర్గాపూజ ఉంది. అందుకని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

- Advertisement -

ఇక.. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుందని, అస్సాం క్రికెట్​ అసోసియేషన్​ (ACA) ప్రేక్షకులకు అదనపు వినోదంతో పాటు, మైదానంలో ఆటగాళ్ల ద్వారా వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మాకు క్రౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. DJలు ప్లే చేస్తాం.. పటాకుల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇది మ్యాచ్ కొనసాగే సమయంలో మొత్తం నడుస్తుంది. అందుకని తాము మంచి గేమ్‌ను ఆశిస్తున్నామని సైకియా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement