– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న 2023 ఎడిషన్ టైటిల్ డిసైడ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన మొదటి సెంచరీ సాధించాడు. 2021లో జరిగిన డబ్ల్యూటీసీ ప్రారంభ ఎడిషన్ ఫైనల్లో సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో ఎవరూ ట్రిపుల్ ఫిగర్లను చేరుకోలేకపోయారు.
కానీ, 2023 టైటిల్ డిసైడర్ ప్రారంభ మ్యాచ్‌లో లెఫ్ట్ హ్యాండర్ హెడ్ తన టెస్ట్ కెరీర్లో ఆరో సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ లోని 65వ ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆకాశం మేఘావృతమైన పరిస్థితుల్లో ఓవల్‌లోని పచ్చని పిచ్‌లో భారత్ టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
కాగా, బ్యాటింగ్‌కి వచ్చిన ఆస్ట్రేలియా రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. ఈ సమయంలో హెడ్ తన స్ట్రోక్‌లను రొటేట్ చేస్తూ.. స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. ఎలాంటి సంకోచం లేకుండా కట్టింగ్, పుల్లింగ్ చేస్తూ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ లంచ్‌కు ముందు అర్ధ సెంచరీని చేరుకున్నాడు.. టీ విరామం తర్వాత 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అతని జట్టును 170/3కి నడిపించాడు.
ఇక.. స్టీవ్ స్మిత్‌తో కలిసి ఈ జోడీ 76-/3 వద్ద చేతులు కలిపిన తర్వాత.. నాలుగో వికెట్‌కు 150 పరుగులకు పైగా జోడించారు. హెడ్ దూకుడుతో ఇండియన్ బౌలర్లపై ఒత్తిడిని పెరిగింది. వైడ్ బాల్స్, షార్ట్ లెంగ్త్, యార్కర్స్ అని చూడకుండా హెడ్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డుని పరుగులుపెట్టించాడు. ఇట్లా తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది.